వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సహా విద్యను ఉచితంగా అందించనున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధులకు మేలు చేయాలన్న ఉద్ధేశ్యంతో ఇంటర్ బోర్డు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు.

బోర్డు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను జూలై నెలాఖరులోగా అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లక్షా 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వీరంతా ఎలాంటి ఫీజులూ చెల్లించాల్సిన అవసరం లేదని, ఫీజు మొత్తం రూ.9 కోట్లను, పాఠ్యపుస్తకాల ఖర్చు రూ.7 కోట్లను ఇంటర్‌ బోర్డే భరిస్తుందని చెప్పారు.

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం


జూన్ 1 నుండి అన్ని సేవలను ఆన్‌లైన్ చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ బోర్డును మోడల్ సంస్థగా నిలబెట్టేందుకు కృషి జరుగుతోందని అన్నారు. ఇంటర్ బోర్డులో ఏ పనికైనా డబ్బులు అడుగుతున్నారని , ప్రతి పని ఆలస్యం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయని, సేవలు అన్నింటినీ పారదర్శకంగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

 ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం

ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించామని ఈ రోజే కొన్ని సర్వీసులు కూడా మొదలుపెట్టడం జరిగిందని అన్నారు. ఎలిజిబిలిటీ సర్ట్ఫికేట్, మైగ్రేషన్ సర్ట్ఫికేట్, డూప్లికేట్ మెమో, మార్కుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ తదితర 22 సర్వీసులను జూలై 1 నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం


దాదాపు 9 కోట్ల రూపాయిలు ఫీజుల రూపేణా వసూలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది నుండి విద్యార్ధులు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించనవసరం లేదని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా పెరిగే విద్యార్ధులు 15వేల మంది ఉండొచ్చని, వారు కూడా ఫీజులు చెల్లించనక్కర్లేదని పేర్కొన్నారు.

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం

ఇంటర్ విద్య పూర్తి ఉచితం: కడియం

కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ లెకరర్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తున్నామని పేర్కొన్నారు. లెక్చరర్లకు శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ మాడ్యూల్స్‌ను తయారుచేస్తున్నామని వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలోని 402 కాలేజీలకు పక్కా భవనాలు నిర్మించాలని, ఆర్‌ఐడిఎఫ్ ద్వారా ల్యాబ్, వౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

English summary
In a landmark decision, the TS government has decided to make Intermediate education completely free of cost in all government-run junior colleges. Students will also be provided textbooks free.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X