మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

105 మినిట్స్ లేట్: అస్తమాతో గిలగిలకొట్టుకున్న రోగి, చేతపట్టని అంబులెన్స్ సిబ్బంది, ప్రాణాలొదిలి...

|
Google Oneindia TeluguNews

అస్తమాతో బాధపడుతోన్న రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో 105 మినిషాల నిర్లక్ష్యం. అక్కడికొచ్చిన ఒక అంబులెన్స్ అతనికి కరోనా ఉందెమోనని అనుమానించింది. మరో అంబులెన్స్ వచ్చేసరికి నిండు ప్రాణం పోయింది. హృదయ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రాణం పోతోన్న అంబులెన్స్ సిబ్బంది చేత పట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మానవత్వమా నీవెక్కడ అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తోంది.

ఇదీ విషయం..

ఇదీ విషయం..

సికింద్రాబాద్‌కు చెందిన 52 ఏళ్ల ఆర్ శ్రీనివాస్ బాబు అనే వ్యక్తి బుధవారం కామారెడ్డి వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లున్న సమయంలో ఇబ్బంది పడ్డాడు. అతనికి అస్తమా ఉండటంతో చేగుంట వద్ద బస్సు దిగాడు. సమీపంలోని ఆస్పత్రికి వెళదామని ప్రయత్నించాడు. కానీ శరీరం సహకరించకపోవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతనితో పోలీసులు మాట్లాడే వీడియో కూడా ఉంది.

అస్తమాతో ఇబ్బంది..

అస్తమాతో ఇబ్బంది..

అస్తమాతో ఇబ్బంది పడుతున్నానని.. శరీరం సహకరించకపోవడంతో బస్సు దిగానని తెలిపాడు. ఆస్పత్రికి వెళ్లేలోపు పడిపోయాని చెప్పాడు. ఎవరైనా దవాఖానకు తీసుకెళ్తారనుకున్నానని ఆశపడ్డాడు. కానీ అంబులెన్స్ సిబ్బంది కూడా చేతపట్టలేదు. అక్కడికి వచ్చిన ఓ అంబులెన్స్.. అతనిని దవాఖానకు తీసుకెళ్లేందుకు మాత్రం నిరాకరించింది. అతనికి కరోనా ఉంది అని, తమ వద్ద పీపీఈ కిట్లు లేవు అని వంకర సమాధానం చెప్పారు. ఫోన్ చేసినా.. గంటకు వచ్చిన సిబ్బంది.. అతనిని చేత పట్టలేదు. దీంతో చేసేదీ లేక పోలీసులు మరో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.

45 నిమిషాలు..

45 నిమిషాలు..

దాదాపు 45 నిమిషాల తర్వాత మరో అంబులెన్స్ వచ్చింది. కానీ శ్రీనివాస్ అప్పటికేచనిపోయాడు. పోలీసులు, సిబ్బంది చూస్తుండగానే అతడు మృతిచెందాడు. అంబులెన్స్ దగ్గరలో చెట్టు కింద అచేతనంగా కనిపించాడు. తర్వాత మరో అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌కు శ్రీనివాస్ మృతదేహం తరలించారు. సాధారణ మృతి అని.. కుటుంబసభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ ఓ సగటు మనిషి ప్రాణం.. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గాలిలోకి కలిసిపోయింది. తొలుత వచ్చిన అంబులెన్స్ సిబ్బంది అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే ప్రాణం పోయేదీ కాదు. కానీ ఇక్కడ మానవత్వం చచ్చిపోయింది. కరోనా వైరస్ చెప్పి.. మరీ మృతిచెందింది.

English summary
105 minutes late: srinivas 52-year-old asthma patient, died in Medak district of Telangana allegedly due to non-availability of timely treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X