• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అర్ధరాత్రి ప్రియురాలి రూమ్‌లో ప్రేమోన్మాది: గొంతుకోసిన డిగ్రీ స్టూడెంట్..: ఆసుపత్రిలో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే అక్కసుతో ఓ యువకుడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఓ యువతిని హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ యువకుడిని పట్టుకుని, చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హోం మంత్రికి సోకిన కరోనా: రెండు డోసుల టీకా తీసుకున్నా వదలని వైరస్: కొత్తగా 733 మంది బలిహోం మంత్రికి సోకిన కరోనా: రెండు డోసుల టీకా తీసుకున్నా వదలని వైరస్: కొత్తగా 733 మంది బలి

 వట్టినాగులపల్లిలో..

వట్టినాగులపల్లిలో..

హైదరాబాద్ శివార్లలోని గచ్చిబౌలి వట్టినాగులపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కిరాతకుడి పేరు ప్రేమ్‌సింగ్. జీడిమెట్లలో నివసిస్తున్నాడు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మాదాపూర్‌లోని ప్రైవేటు విద్యాసంస్థలో డిగ్రీ చదువుతున్న రూఖీసింగ్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. రూఖీసింగ్ తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వట్టినాగులపల్లిలో నివసిస్తోంది.

రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం..

రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం..

ప్రేమ్‌సింగ్-రూఖీసింగ్ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉంది. అతనుతరచూ ఆమె ఇంటికి వస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను.. రూఖీని ప్రేమించాడు. తన ప్రేమను రూఖీకి తెలియజేశాడు. అతని ప్రపోజల్‌ను అంగీకరించలేదు. ప్రేమిస్తున్నట్లు తెలిసినప్పటి నుంచీ అతణ్ని దూరం పెట్టింది. దీనితో ప్రేమ్‌సింగ్‌.. రూఖీపై పగ పెంచుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో బైక్‌పై వట్టినాగులపల్లికి చేరుకున్నాడు.

బెడ్‌రూమ్‌లో జొరబడి..

బెడ్‌రూమ్‌లో జొరబడి..

ఆమె బెడ్‌రూమ్‌లోకి జొరబడ్డాడు. నిద్రపోతున్న రూఖీ సింగ్‌పై కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతును కోయడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేశారు. దీనితో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ప్రేమ్‌సింగ్‌ను పట్టుకుని చితగ్గొట్టారు. అతని హత్యాయత్నం నుంచి తప్పించుకునే క్రమంలో రూఖీసింగ్‌ ఒంటిపై పలుచోట్ల కత్తి గాయాలయ్యాయి. గొంతు, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

కుటుంబ సభ్యుల దాడిలో ప్రేమ్‌సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. ప్రేమ్‌సింగ్‌పై హత్యాయత్నం, రాత్రిపూట ఇంట్లోకి చొరబడటం, కిడ్నాప్‌కు ప్రయత్నించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రేమ్‌సింగ్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నారు.

 అర్ధరాత్రి దాటిన తరువాత..

అర్ధరాత్రి దాటిన తరువాత..

కాగా- రూఖీ సింగ్‌పై చోటు చేసుకున్న దాడి గురించిన పూర్తి వివరాలను ఆమె సోదరుడు, సమీప బంధువు మీడియాకు తెలియజేశారు. తాను లింగంపల్లికి వెళ్లి అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు ఇంటికి చేరుకున్నానని, ఆ సమయంలో తలుపు కాస్త తెరిచి ఉన్నట్లు గమనించానని చెప్పారు. ఇంట్లో వాళ్లు డోర్ సరిగ్గా వేయలేదని, తాను తొలుత భావించానని అన్నారు. ఆ వెంటనే తాము పెంచుకుంటోన్న కుక్క మొరగడం మొదలు పెట్టిందని, దీనితో తాము లేచి చూడగా.. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించామని అన్నారు.

గొంతు కోయడానికి ప్రయత్నం..

గొంతు కోయడానికి ప్రయత్నం..

తన సోదరి గొంతు కోయడానికి ప్రయత్నించాడని సోదరుడు చెప్పారు. ముఖద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశించిన అతను నేరుగా చెల్లి నిద్రించి ఉన్న రూమ్‌కు వెళ్లాడని, హత్యాయత్నం చేశాడని అన్నారు. లోపలి వైపు నుంచి గడియ పెట్టాడని, చెల్లి అరుపులు విని, డోర్ పగులగొట్టి లోనికి వెళ్లామని వివరించారు. కత్తితో గొంతును కోసే సమయంలో దాన్ని లాగడంతో చేతికి గాయాలయ్యాయని అన్నారు. ఆసుపత్రిలో చేర్పించామని, ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారని చెప్పారు.

English summary
Man tries to cut throat a young woman after rejecting his proposal near Gachibowli in Hyderabad of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X