వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ఛాన్స్ ప్లీజ్..: ట్రంప్‌కు గుడి కట్టిన తెలంగాణ కుర్రాడు..కేంద్రానికి వేడుకోలు: ఎందుకుంటే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

3 Minutes 10 Headlines | Yuvraj Singh In Web Series | Donald Trump Temple In TS | Oneindia Telugu

హైదరాబాద్: ఆయన పేరు బుస్సా కృష్ణ. తెలంగాణలోని జనగామలో రెండు గదులు ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. జనగామలో బుస్సా కృష్ణ అనే పేరు స్థానికులకు పెద్దగా తెలియకపోవచ్చు. బట్- ట్రంప్ కృష్ణ అని చెబితే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. కారణం.. అమెరికా అధ్యక్షుడికి వీరాభిమాని కావడమే. ఆయన అభిమానం ఏ స్థాయింలో ఉందంటే.. ట్రంప్‌నకు గుడి కట్టేంతలా. ఆర్థిక స్థోమత సహకరించకపోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. సొంత ఖర్చులతో డొనాల్డ్ ట్రంప్‌కు గుడి కట్టాడు. ట్రంప్ అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎంజగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం

నెలరోజుల్లో గుడి నిర్మాణం

నెలరోజుల్లో గుడి నిర్మాణం

నెలరోజుల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన గుడి కట్టాడట. దీనికోసం రోజూ 15 మంది భవన నిర్మాణ కార్మికులతో పని చేయించాడట.బయటెక్కడో కడితే ఆ గుడి నిరాదరణకు గురయ్యే అవకాశం ఉందనే ఏకైక కారణంతో తన ఇంటి ముందే దాన్ని నిర్మించాడు. ఆరడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని కొలువు తీర్చాడు. ఈ గుడిని కట్టడానికి అప్పులు కూడా చేశాడని ట్రంప్ క‌‌ృష్ణ సన్నిహితులు చెబుతున్నారు.

రోజూ పూజలు..పునస్కారాలు.. !

రోజూ పూజలు..పునస్కారాలు.. !

గుడి కట్టి, దాన్ని అలా వదిలేయలేదు. రోజూ పూజలు, పునస్కారాలను నిర్వహిస్తుంటారు. తెల్లవారు జామునే లేచి శుచిగా స్నానం చేసి ట్రంప్‌కు పూజలు నిర్వహిస్తారు. దాని తరువాతే ఏ పనైనా. ఆ గుడి మెట్ల వద్దే ఆగిపోలేదు బుస్సా కృష్ణ అభిమానం. ట్రంప్ ఫొటోను తన పాకెట్‌లో పెట్టుకుంటాడు. తాను నిరాశకు గురైన సందర్భంలో పర్స్‌లో ఉన్న ట్రంప్ ఫొటోను చూసి ఉత్తేజితులవుతుంటారట. ఆయన మొబైల్ ఫోన్ వెనుక కూడా ట్రంప్ ఫొటోనే ఉంటుంది.

తీరని కల.. తీరేదెలా.. ?

తీరని కల.. తీరేదెలా.. ?

ట్రంప్‌కు ఈ రేంజ్‌లో అభిమానించే బుస్సా కృష్ణకు ఓ కోరిక ఉంది. అది తీరే సమయం ఆసన్నమూ అయింది. తీరుతుందా? లేదా? అనేదే ఇప్పుడు ఆయనను వేధించే ప్రశ్న. అందుకే- ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆ కోరికే- డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకోవడం. సాధారణంగా- ఎక్కడో ఏడు సముద్రాల అవతల ఉండే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిని కలుసుకోవడం, ఆయనతో చేతులు కలపడం అనేది పక్కన పెడితే.. దూరం నుంచి మాత్రమే చూడటానికి గల అవకాశాలు కూడా తక్కువే ఓ సామాన్యుడికి.

ఎలాగైనా కలిసే అవకాశం ఇవ్వాలంటూ..

ఎలాగైనా కలిసే అవకాశం ఇవ్వాలంటూ..

ఆ అమెరికా అధ్యక్షుడే, తన జీవిత భాగస్వామితో కలిసి మనదేశానికి కదిలి వస్తున్నారు. అందుకే- ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని, కనీసం దూరం నుంచైనా చూసే భాగ్యాన్ని ప్రసాదించాలని బుస్సా కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. తన కలను సాకారం చేయాలని వేడుకుంటున్నారు. అతని స్నేహితులు రమేష్ రెడ్డి, వెంకట్ గౌడ్ తదితరులు స్థానిక బీజేపీ పెద్దలను కూడా కలిసి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

English summary
A die-hard fan of United States President Donald Trump, Bussa Krishna, has put forth an appeal to the Central government to fulfill his wish of meeting his idol during his upcoming India visit. "I want India-America relations to remain strong. Every Friday I fast for Trump's long life. I also carry his picture and pray to him before commencing any work. I wish to meet him, I request the government to make my dream come true," Bussa told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X