• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రైవేట్‌కు గుడ్‌బై-తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు పోటెత్తుతున్న అడ్మిషన్లు-40శాతం జంప్-కారణాలివే...

|

గతేడాది కోవిడ్ పీక్స్‌లో ఉన్న సమయంలో 'రివర్స్ మైగ్రేషన్' అన్న మాట వార్తల్లో ఎక్కువగా వినిపించింది.బతుకుదెరువు కోసం పట్టణాలు,నగరాలకు వెళ్లినవారంతా కరోనా కారణంగా తిరిగి గ్రామాలకు వెళ్లడాన్ని రివర్స్ మైగ్రేషన్‌గా పేర్కొన్నారు. ఉపాధి,ఉద్యోగ రంగంలోనే కాదు కరోనా కారణంగా విద్యా రంగంలోనూ 'రివర్స్ మైగ్రేషన్' జరుగుతోంది. తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో 40శాతం అడ్మిషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. కొత్తగా దాదాపు 1.25లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. జాతీయ మీడియా 'ది ప్రింట్' ఈ కథనాన్నిప్రచురించింది.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

పెరిగిన అడ్మిషన్లకు కారణాలేంటి...

పెరిగిన అడ్మిషన్లకు కారణాలేంటి...

కరోనా కారణంగా చాలామంది తల్లిదండ్రులు ఉపాధి,ఉద్యోగాలను కోల్పోయారు. కుటుంబ పోషణ భారంగా తయారైన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రైవేట్ స్కూళ్లలో వేల రూపాయల ఫీజులు చెల్లించడం వారికి మరింత భారంగా తయారైంది.దీంతో తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు దాదాపు 1.25లక్షల మంది ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారారు. ఇవన్నీ ప్రభుత్వ డే స్కాలర్ స్కూల్స్ మాత్రమే.

ప్రతీ ఏటా 15శాతానికి మించదు... కానీ ఈసారి...

ప్రతీ ఏటా 15శాతానికి మించదు... కానీ ఈసారి...

ప్రభుత్వ డేటా ప్రకారం గత విద్యా సంవత్సరంలో 85వేల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి మారారు. గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈసారి ఇది 40శాతం పెరిగింది. ప్రతీ ఏటా ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి మారే విద్యార్థుల సంఖ్య 10-15శాతానికి మించదు. కానీ ఈసారి ఏకంగా 40శాతం మేర నమోదవడం గమనార్హం. హైదరాబాద్‌లోని మహబూబియా గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ ఇన్‌చార్జి నీరజ మాట్లాడుతూ... ఈ విద్యాసంవత్సరం తమ స్కూల్లో 6 నుంచి పదో తరగతి వరకు కొత్తగా 110 అడ్మిషన్లు జరిగాయన్నారు. వీళ్లంతా ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చినవారేనని చెప్పారు.తాజా అడ్మిషన్లతో కలిపి స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 410కి చేరిందని.. టీచర్స్ మాత్రం 17 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.

ఉద్యోగం కోల్పోయి... పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు...

ఉద్యోగం కోల్పోయి... పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు...

సాధారణంగా ప్రతీ విద్యా సంవత్సరం 20 కన్నా మించి కొత్త అడ్మిషన్లు జరగవని నీరజ పేర్కొన్నారు.కానీ ఈ సంవత్సరం ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు.పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూల్‌కు ఎందుకు మారుస్తున్నారని అడ్మిషన్ సమయంలో ప్రతీ తల్లిదండ్రులను అడిగామన్నారు. ప్రైవేట్‌లో ఫీజులు చెల్లించలేకనే ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నామని చాలామంది చెప్పారన్నారు.ఇదే అంశంపై మహేష్ అనే ఓ ప్రైవేట్ టీచర్ మాట్లాడుతూ... గత ఆర్నెళ్లుగా తనకు ఉద్యోగం లేదన్నారు.తన భార్య సంపాదనతో ఇల్లు గడుస్తోందని చెప్పారు. ప్రస్తుతం నా పిల్లలను ప్రైవేట్‌లో చదివించాలంటే సంవత్సరానికి ఎంత లేదన్నా రూ.1.2లక్షల వరకు ఖర్చవుతుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనంత ఫీజు చెల్లించలేను.అందుకే నా పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు మార్చాను.' అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఆ అనిశ్చితి కూడా ఒక కారణం...

ఆ అనిశ్చితి కూడా ఒక కారణం...


ఈ నెల నుంచే రాష్ట్రంలో విద్యా సంస్థలు రీఓపెన్ అయిన సంగతి తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులను స్కూళ్లకు రావాలని బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.దీంతో ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం అంతంత మాత్రంగానే ఉంటోంది.ఇక చాలావరకు ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల రీఓపెనింగ్‌పై నెలకొన్న అనిశ్చితి కూడా కొంతమంది తల్లిదండ్రులను ప్రభుత్వ స్కూళ్ల వైపు చూసేలా చేస్తోంది.అలా ఈ విద్యాసంవత్సరం దాదాపు 6వేల ప్రైవేట్ స్కూళ్ల నుంచి విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోకి మారారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి అడ్మిషన్లు ఎక్కువవడంతో కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు సైతం పెడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  పాఠశాలల్లో అమ్మాయిల కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేసిన ప్రొఫెసర్ సుజాత
  తప్పని పరిస్థితుల్లోనే ప్రభుత్వ స్కూళ్లకు...

  తప్పని పరిస్థితుల్లోనే ప్రభుత్వ స్కూళ్లకు...


  ప్రైవేట్ స్కూళ్లు ట్రాన్స్‌పోర్ట్ బస్సులను నిలిపివేయడం కూడా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు మారడం ఒక కారణంగా చెబుతున్నారు.ఇక ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలిచ్చినప్పటికీ... పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యపై అంత నమ్మకం లేకపోయినప్పటికీ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాల్సి వస్తోందని కొంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత ఉందని,సరైన మౌలిక వసతులు లేవని అంటున్నారు.తెలంగాణలో మొత్తం 41వేల స్కూళ్లు ఉండగా ఇందులో 26,800 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 23లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగతా 11వేల ప్రైవేట్ స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.మరో 600 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న టీచర్ పోస్టుల్లోనే 20వేల ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా విద్యపై ఫోకస్ చేసి సరైన మౌలిక వసతులు కల్పించాలని,టీచర్ల నియామకాన్ని చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

  English summary
  The term 'reverse migration' was widely reported in the news during covid Peaks last year. 'Reverse migration' is taking place not only in the field of employment but also in the field of education due to corona. This is evidenced by the 40 per cent increase in admissions in government schools in Telangana in the 2021-22 academic year.About 1.25 lakh new students have joined govt schools from private schools.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X