వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ నుండి తెలుపుకు మారిన టీఎమ్‌యూ జెండా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ అనుబంధ విభాగం తన జెండా రంగును మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్న గులాబి రంగును తొలగించి తెల్లరంగు జెండాను అవిష్కరించేందుకు సిద్దమైంది. నేడు జరిగిన టీఎమ్‌యూ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో మారిన జెండాతో ఎగరవేశారు. దీంతో ప్రభుత్వంపై మరింత పోరాటాన్ని ఉదృతం చేసేందుకు కార్మికులు సిద్దవుతున్నారు.

తెలంగాణ మజ్దూర్ యూనియన్ తన జెండా రంగును మార్చుకుంది. నేటి వరకు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూ గులాబీ రంగు జెండాలో ఉండేది. ప్రస్తుతం ఆర్టీలో జరుగుతున్న పరిణామాలతో యూనియన్ నాయకులకు మరియు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. దీంతో ఆర్టీసీని విలీనం చేసే డిమాండ్ పై కార్మికులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది.

Telangana Mazdoor Union changed its flag color

దీంతో ప్రభుత్వ అనుబంధ సంఘంగా ఉండడం వల్ల కార్మికులకు ఒరిగేదేమీ ఉండదనే యోచనలో కార్మిక సంఘం ఉన్నట్టుంది. దీంతో నేడు జరగిన ఆవిర్భావదినోత్సంలో పార్టీ తెల్లరంగుతోపాటు జెండా మధ్యలో ఉన్న బాణం గుర్తు గల జెండాను అవిష్కరించేందుకు సిద్దమయ్యారు.

సంఘం ఏర్పాటు నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో బాగంగా పలు ఆర్టీసీ సంఘాలు ముందుకు వచ్చి సకల జనుల సమ్మెకు నాందిపలికాయి. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఖరితో మజ్దుర్ యూనియన్ స్వతంత్ర సంఘంగా వ్యవహరించనుంది.

English summary
Telangana Mazdoor Union RTC affiliated to the Telangana Rashtra samithi has changed its flag color.flag will be changed into white color.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X