వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిగా కల నెరవేర్చుకున్న ఎర్రబెల్లి ... రాజకీయ ప్రస్థానం ఇదే

|
Google Oneindia TeluguNews

ఎర్రబెల్లి దయాకర్ రావు 1956 జులై 4 న వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఎర్రబెల్లి జగన్నాథరావు,ఎర్రబెల్లి ఆదిలక్ష్మి.భార్య పేరు ఉషా రాణి . వీరికి కుమారుడు ప్రేమ చందర్ రావు, కుమార్తె ప్రతిమారావ్ ఇద్దరు పిల్లలు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. విద్యార్థి సంఘాలు ఏర్పాటు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు.

1982లో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం 1983 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 1994, 1999, 2004 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత జరిగిన డీలిమిటేషన్ లో భాగంగా 2009 నుండి 2014, 2018 సాధారణ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ సాధించారు. మొత్తం ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తిరుగులేని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు. రాజకీయాల్లో ఇంతకాలం ఆయన సాగించిన ప్రయాణంలో దాదాపుగా సక్సెస్ ని చవిచూసిన ఎర్రబెల్లి దయాకర రావు మంత్రి కావాలనే సుదీర్ఘ వాంఛ ఇంతకాలానికి నెరవేరింది. కేసీఆర్ క్యాబినెట్ లో ఎర్రబెల్లికి స్థానం దక్కింది.

 ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రస్థానం

ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రస్థానం

1982 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావ సమయంలో 20 వేల మందితో వరంగల్ లో సమావేశం ఏర్పాటు చేసి సభకు అధ్యక్షత వహించారు. అదే సంవత్సరం తెలుగుదేశం పార్టీ ప్రథమ జిల్లా కన్వీనర్ గా పని చేశారు. ఆ సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, మరియు వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు సైతం నిర్వహించారు.1983 లో తొలిసారి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.1987వ సంవత్సరంలో కల్లెడ సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.

 వర్ధన్నపేట నియోజకవర్గం నుండి విజయం

వర్ధన్నపేట నియోజకవర్గం నుండి విజయం

ఆ తర్వాత 1994 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగురవేసి శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడంలో తనదైన పాత్ర పోషించారు.
1997లో వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కీలకంగా పని చేశారు. జిల్లాలో టిడిపి ప్రతిష్టను పెంచే విధంగా పని చేసి చంద్రబాబు నాయుడు చేత ప్రశంసలు పొందారు. ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 1999 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ 11,584 ఓట్ల మెజారిటీతో రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే అదే సంవత్సరం రెండోసారి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.1999 వ సంవత్సరంలో శాసనసభ మొదటి సమావేశాల్లోనే ప్రభుత్వ విప్ గా నియామకమయ్యారు. నాటి రాజకీయాల్లోనూ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కీలక భూమికను పోషించారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

వరుసగా జిల్లా అధ్యక్షుడుగా

వరుసగా జిల్లా అధ్యక్షుడుగా

2001వ సంవత్సరంలో వరుసగా మూడవ సారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రబెల్లి దయాకర్ రావు 2001లో విశాఖపట్నంలో జరిగిన మహానాడులో ఉత్తమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రశంసలు పొందారు. 200౩లో తన తండ్రిగారైన స్వర్గీయ ఎర్రబెల్లి జగన్నాథరావు పేరిట చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి వర్ధన్నపేట నియోజకవర్గంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. 61 వేల మందికి వైద్య సేవలు అందించారు. నేటికీ ఈ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మూడో సారి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా గెలుపొందారు. 2005లో, 2007లో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యునిగా రెండు సార్లు నియామకం అయ్యారు. 2007 మార్చి 26న అసెంబ్లీ సమావేశాల్లో బాబ్లీతో పాటు 11 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

 తెలంగాణ సాగు నీటి కోసం లాఠీ దెబ్బలు

తెలంగాణ సాగు నీటి కోసం లాఠీ దెబ్బలు

2008 జూన్లో వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా గెలుపొందారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 2009వ సంవత్సరం డీలిమిటేషన్ లో భాగంగా జరిగిన సాధారణ ఎన్నికల్లో నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2011లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి మహారాష్ట్ర పోలీసులతో తెలంగాణ సాగు నీటి కోసం లాఠీ దెబ్బలు తిన్నారు. 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఐదవసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2014లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 10 తేదీన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఫిబ్రవరి 25న కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో పాలకుర్తి నియోజకవర్గం నుండి 53062 ఓట్ల భారీ మెజారిటీతో ఆరవసారి శాసనసభ్యుడిగా విజయకేతనం ఎగురవేశారు .వరుసగా 3 పర్యాయాలు పాలకుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా స్థానం దక్కించుకున్నారు.

English summary
Errabelli dayakar rao a senior leader of TRS party got an opportunity in KCR cabinet.Errabelli Dayakar Rao’s dream is fulfilled as a minister. Dayakar Rao began his political career as a founding member of the Telugu Desam party.Of the seven times he contested to the Assembly, he lost just once and won six times on a trot.After tasting defeat in 1983, he was elected thrice from Wardhannapet constituency in 1994, 1999 and 2004. After the constituency was reserved for SCs during the delimitation, he moved to Palakurthi and won in 2009, 2014 and in 2018.He switched to the TRS in 2016 while he was the TDLP floor leader. Even though he was a successful politician, he never got the chance of becoming a minister.But now his dream is fullfilled as a minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X