వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పరిస్థితులు తెలంగాణకు అనుకూలం: సద్వినియోగం చేసుకోండి: హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు తెలంగాణకు కలిసి వస్తాయని మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని పైన నెలకొన్న వివాదం..ప్రాంతాల వారీగా వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కలిసివస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. బ్యూరోక్రాట్లు.. వ్యాపార వేత్తలు హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.దీంతో..ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

సద్వినియోగం చేసుకోవాలి..
తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలంగాణకు అనుకూలంగా మారుతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని రియల్ వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనేక నగరాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని.. హైదరాబాద్‌లో ఎలాంటి సమస్యలూ లేవన్నారు.ప్రస్తుతం తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని హరీష్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజధాని సమస్య మీద తెలంగాణలో ఏ నేత స్పందించలేదు. కానీ, మంత్రి హరీష్ పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

Telangana minister Harish Rao key comments on AP situation

హైదరాబాద్ పైనే ఆసక్తి..
క్రెడాయ్ తెలంగాణ సమావేశంలో మంత్రి హరీష్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఐటీ ఉద్యోగులతో పాటు బ్యూరోక్రాట్లు, వ్యాపార వేత్తలు హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. చెన్నైలో మంచినీటి సమస్య, బెంగళూరులో ట్రాఫిక్‌, ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో అధిక ధరలు ఉంటే హైదరాబాద్‌లో ఎలాంటి సమస్యలూ లేవన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలోని పెద్ద బిల్డర్లు సామాజిక బాధ్యతగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డ బుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. హరీష్ వ్యాఖ్యలను ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ను లక్ష్యంగా చేసుకోవటానికి అనుకూలంగా మలచుకొనే అవకాశం కనిపిస్తోంది. మరి..ఏపీ అధికార పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

English summary
Telangana minister Harish Rao key comments on AP situation. He says that present situation in AP creating benefit for Telangana. Real Estate business peopole to utilise it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X