వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కైవేలకు భూములు కేటాయించండి ... రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రాజెక్టులకు భూములు కేటాయించాలని ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని ఆయన లేఖలో పేర్కోన్నారు. , స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిదని, ఇందుకోసం భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్ మంత్రి కేటీఆర్‌ కోరారు.

హామీలు ఘనం.. ఆచరణ శూన్యం: కేటీఆర్‌ హామీకి వసంతం పూర్తిహామీలు ఘనం.. ఆచరణ శూన్యం: కేటీఆర్‌ హామీకి వసంతం పూర్తి

దేశ రాజధాని ఢిల్లీలో మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ సదస్సుకు రాష్ట్రం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన సదస్సు కొనసాగింది . సదస్సు ప్రారంభానికి ముందు మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. కాగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర, జాతీయ రహదారులపై స్కైవేలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.... స్కైవేలకు సమాంతరంగా గ్రౌండ్ లెవల్ రోడ్డును వెడల్పు చేసి ఆకర్షణీయంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Telangana Minister KTR met with Union Defense Minister Rajnath Singh

ఈ నేపథ్యంలోనే అటు రాజీవ్ రహదారిపైన 10 కిలోమీటర్ల స్కైవే, నర్సాపూర్ రోడ్డులోని బాలానగర్- అవుటర్ రింగ్‌రోడ్డు వరకు దాదాపు 6 కిలోమీటర్ల స్కైవే, ఉప్పల్- ఘట్‌కేసర్‌లో మరో స్కైవే, గోల్నాక- అంబర్‌పేట్ ఫ్లెఓవర్ బ్రిడ్జినిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌లు రూపోందించింది. అయితే ప్రస్తుతం ఉప్పల్ -ఘట్‌కేసర్ స్కైవే పనులు కొనసాగుతుండగా మరోవైపు గోల్నాక -అంబర్‌పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్డి నిర్మాణ పనులు అర్థంతరంగా ఆగిపోయాయి.

English summary
Telangana Minister KTR met with Union Defense Minister Rajnath Singh in Delhi on Wednesday.He was asked to allocate lands for the ongoing projects in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X