• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా..

|

మిర్యాలగూడ: ఇటీవల హత్యకు గురైన ప్రణయ్ సతీమణి అమృత, అతని తల్లిదండ్రులను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటలో ప్రణయ్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతరం అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత, సోదరుడు అజయ్‌లను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రణయ్‌ హత్య దురదృష్టకరమని, అత్యంత హేయనీయమైన ఈ ఘటనను ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. అనాగరికమైన పని చేసి పరువు పోగొట్టుకున్నారన్నారు. అమృతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రణయ్‌ ఘటన జరిగిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షించేలా కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు.

రూ.4.12 లక్షలు అందించిన జగదీశ్వర్ రెడ్డి

రూ.4.12 లక్షలు అందించిన జగదీశ్వర్ రెడ్డి

అమృతకు రూ.8.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇందులో భాగంగా రూ.4.12 లక్షల చెక్కు జగదీశ్వర్ రెడ్డి అందించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ నుంచి అమృతకు వ్యవసాయ భూమి, రెండు పడకల ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగం అందిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ వారిని పరామర్శించిన అనంతరం, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమృతకు రూ.1కోటి ఇస్తామని చెప్పారు. ఇప్పటికే తమ్మినేని ఆమె వయస్సు గురించి కూడా ఆలోచించకుండా ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని ప్రకటించారు.

జేబులో చేతులతో ధీమాగా మారుతీరావు, నీ కూతురే నీకు ఉరిశిక్ష వేయమంటుందని అడగ్గా...

బెయిల్ రాకుండా చూడమని అమృత

బెయిల్ రాకుండా చూడమని అమృత

ప్రణయ్ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారిని కలిశారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రణయ్ - అమృతల పరిచయం, ప్రేమ కోసం చదువు మధ్యలో ఆపేయడం, పెళ్లి, తదనంతర పరిణామాలపై అడిగి తెలుసుకున్నారు. కేసులో ఇంకా ఎలాంటి సహకారం కావాలని అధికారులు కోరగా.. తన తండ్రి, ఇతర నిందితులకు బెయిల్ రాకుండా చూడాలని అమృత, కుటుంబసభ్యులు కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు.

బెయిల్ వద్దు, బయటకు వస్తే..

బెయిల్ వద్దు, బయటకు వస్తే..

ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులకు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉరితీయాలి ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి డిమాండ్ చేశారు. శ్రవణ్ బయటకు వస్తే తమను కూడా చంపుతాడని, నిందితులు బెయిల్ పైన వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పారు.

  ప్రణయ్ హంతకుడికి ఇచ్చింది రూ.21వేలు, ఆ రోజు హత్య జరగకుంటే..!
  అమృత తండ్రి, మిగతా వారికి మద్దతుగా ప్రకటనపై

  అమృత తండ్రి, మిగతా వారికి మద్దతుగా ప్రకటనపై

  కోదాడ తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతి... ప్రణయ్‌ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం అమృతతో ప్రణయ్‌ తల్లిదండ్రులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వారికి అండగా ఉంటుందని చెప్పారు. ఇండియా ప్రజా బంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ అద్దంకి రంజిత్‌ ఓసీర్‌ కూడా పరామర్శించారు. ప్రణయ్ హంతకులను సమర్థిస్తూ చాలామంది బహిరంగ ప్రకటన చేయడం సరికాదన్నారు. జమియతే ఉలేమా ఏ హింద్ ప్రతినిధులు, మిర్యాలగూడ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పలువురు తదితరులు వచ్చారు. ప్రణయ్ హత్య నేపథ్యంలో అమృతకు వ్యతిరేకంగా, మారుతీరావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని పలువురు ఖండించారు. ప్రణయ్ హత్యకు నిరసనగా, అమృతకు మద్దతుగా హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని తెలంగాణ ప్రజల పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు.

  English summary
  Six days after the brutal killing caste killing of Pranay, a Dalit Christian in Telangana, the state government has responded and announced compensation for the victim’s family and assured a job to Amrutha, the deceased's wife.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X