హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ పార్టీ నుంచి, ఏ జిల్లా నుంచి ఎవరు, గెలిచిన వారు వీరే: ఆ సర్వే ఒక్కటే నిజమైంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కారు దూసుకుళ్లింది. మజ్లిస్ పార్టీ తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2014లో ఐదు స్థానాల్లో గెలవగా, ఈసారి ఒకటే గెలిచింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ లోథ్ గెలిచారు. మహాకూటమి 21 స్థానాల్లో విజయం సాధించింది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారయ్యాయి. ఒక్క ఇండియా టుడే సర్వే మాత్రమే తెరాసకు 79 నుంచి 91 వస్తాయని చెప్పింది. అదే నిజమైంది.

టీఆర్ఎస్ భారీ విజయం, గులాబీ సంబరాలు (ఫోటోలు)

కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్ రెడ్డి, కొండా సురేఖ వంటి హేమాహేమీలు ఓడిపోయారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా పని చేసిన జూపల్లి కృష్ణా రావు, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, చందూలాల్ ఓడిపోయారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి కీలక నేతలు ఓడిపోయారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచారంటే...

1. అదిలాబాద్ జిల్లా (10 స్థానాలు)

1. అదిలాబాద్ జిల్లా (10 స్థానాలు)

అదిలాబాద్ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తెరాస 9 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో గెలిచింది. గెలిచిన స్థానాలు ఇవే..

సిర్పూరు - కోనేరు కోనప్ప (టీఆర్ఎస్)
బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య (టీఆర్ఎస్)
అసిఫాబాద్ - ఆత్రం సక్కు (కాంగ్రెస్) (ఓటమి -కోవా లక్ష్మి)
అదిలాబాద్ - జోగు రామన్న (టీఆర్ఎస్)
నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (టీఆర్ఎస్)
చెన్నూరు - బాల్క సుమన్ (టీఆర్ఎస్)
మంచిర్యాల - నడిపేల్లి దివాకర్ రావు
ఖానాపూర్ - రేఖా నాయక్ (టీఆర్ఎస్)
బోథ్ - రాథోడ్ బాబురావు (టీఆర్ఎస్)
ముథోల్ - విఠల్ రెడ్డి(టీఆర్ఎస్)

2. నిజామాబాద్ జిల్లా (9 స్థానాలు)

2. నిజామాబాద్ జిల్లా (9 స్థానాలు)

నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 8 చోట్ల, కాంగ్రెస్ 1 చోట గెలిచింది. గెలిచిన స్థానాలు ఇవే..

ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్ రెడ్డి (టీఆర్ఎస్)
జుక్కల్ - హన్మంత్ షిండే (టీఆర్ఎస్)
ఎల్లారెడ్డి - జుజుల సురేందర్ (కాంగ్రెస్)
నిజామాబాద్ అర్బన్ - బిగాల గణేష్ గుప్త (టీఆర్ఎస్)
బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి (టీఆర్ఎస్)
బోధన్ - షకీల్ అహ్మద్ (టీఆర్ఎస్)
బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్)
కామారెడ్డి - గంప గోవర్ధన్ (టీఆర్ఎస్) (ఓటమి -షబ్బీర్ అలీ)
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి (టీఆర్ఎస్)

 3. కరీంనగర్ జిల్లా (13 స్థానాలు)

3. కరీంనగర్ జిల్లా (13 స్థానాలు)

కరీంనగర్‌లో 13 స్థానాలు ఉండగా తెరాస 11, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 1చోట గెలిచారు.

కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర రావు (టీఆర్ఎస్)
జగిత్యాల - సంజయ్ కుమార్ (టీఆర్ఎస్) (ఓటమి-జీవన్ రెడ్డి)
ధర్మపురి - కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)
రామగుండం - కోరుకంటి చందర్ (ఇండిపెండెంట్)
మంథని - శ్రీధర్ బాబు (కాంగ్రెస్)
పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి (టీఆర్ఎస్)
కరీంనగర్ - గంగుల కమలాకర్ (టీఆర్ఎస్) (ఓటమి - బండి సంజయ్)
చొప్పదండి - సుంకే రవిశంకర్ (టీఆర్ఎస్)
వేములవాడ -చెన్నమనేని రమేష్ (టీఆర్ఎస్)
సిరిసిల్ల - కల్వకుంట్ల తారక రామారావు (టీఆర్ఎస్)
మానకొండూరు - రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్)
హుజూరాబాద్ - ఈటెల రాజేందర్ (టీఆర్ఎస్)
హుస్నాబాద్ - సతీష్ కుమార్ (టీఆర్ఎస్) (ఓటమి - చాడ వెంకట్ రెడ్డి)

4. మెదక్ జిల్లా (10 స్థానాలు)

4. మెదక్ జిల్లా (10 స్థానాలు)

మెదక్ జిల్లాలో పది స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది.

సిద్దిపేట - హరీష్ రావు (టీఆర్ఎస్)
గజ్వెల్ - కేసీఆర్ (టీఆర్ఎస్) (ఓటమి - వంటేరు ప్రతాప్ రెడ్డి)
మెదక్ - పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
నారాయణఖేడ్ - భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
ఆందోల్ - క్రాంతి కిరణ్ (టీఆర్ఎస్)
నర్సాపూర్ - మదన్ రెడ్డి (టీఆర్ఎస్)
జహీరాబాద్ మదన్ రెడ్డి (టీఆర్ఎస్)
సంగారెడ్డి - తూర్పు జయప్రకాశ్ రెడ్డి (కాంగ్రెస్)
పటాన్‌చెరు - గూడెం మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
దుబ్బాక - సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్)

 5. రంగారెడ్డి జిల్లా (14 స్థానాలు)

5. రంగారెడ్డి జిల్లా (14 స్థానాలు)

రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లు ఉండగా తెరాస 10, కాంగ్రెస్ 3, ఇతరులు 1 స్థానంలో గెలిచారు.

మేడ్చల్ - మల్లారెడ్డి (టీఆర్ఎస్)
కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద (టీఆర్ఎస్)
ఉప్పల్ - బేతి సుభాష్ రెడ్డి (టీఆర్ఎస్)
ఎల్బీ నగర్ - సుధీర్ రెడ్డి (కాంగ్రెస్)
రాజేంద్ర నగర్ - ప్రకాశ్ గౌడ్ (టీఆర్ఎస్)
చేవెళ్ల - కాలె యాదయ్య (టీఆర్ఎస్)
వికారాబాద్ - మెతుకు ఆనందం (టీఆర్ఎస్)
మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు (టీఆర్ఎస్)
కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు (టీఆర్ఎస్)
ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీఆర్ఎస్)
మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) (ఓటమి తీగల కృష్ణారెడ్డి)
శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ (టీఆర్ఎస్)
పరిగి - కొప్పుల మహేష్ రెడ్డి (టీఆర్ఎస్)
తాండూరు - పైలట్ రోహిత్ రెడ్డి (కాంగ్రెస్) (ఓటమి-పట్నం మహేందర్ రెడ్డి)

6. హైదరాబాద్ జిల్లా (15 స్థానాలు)

6. హైదరాబాద్ జిల్లా (15 స్థానాలు)

హైదరాబాదులో 15 స్థానాలు ఉండగా తెరాస 7, మజ్లిస్ 7, బీజేపీ 1 స్థానంలో గెలిచింది.

ముషీరాబాద్ - ముఠా గోపాల్ (టీఆర్ఎస్) (ఓటమి- డాక్టర్ కె లక్ష్మణ్)
అంబర్‌పేట - కాలేరు వెంకటేష్ (టీఆర్ఎస్) (ఓటమి - కిషన్ రెడ్డి)
జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్ (టీఆర్ఎస్)
నాంపల్లి - జాఫర్ హుస్సేన్ మిరాజ్ (మజ్లిస్)
గోషామహల్ - రాజాసింగ్ లోథ్ (బీజేపీ)
చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ (మజ్లిస్)
బహదూర్‌పురా - మహ్మద్ మొజంఖాన్ (మజ్లిస్)
కంటోన్మెంట్ - జి.సాయన్న (టీఆర్ఎస్)
మలక్‌పేట -అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (మజ్లిస్)
ఖైరతాబాద్ - దానం నాగేందర్ (టీఆర్ఎస్)
సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్)
కార్వాన్ - కౌసర్ మోహియుద్దీన్ (మజ్లిస్)
చార్మినార్ - పాషా ఖాద్రీ (మజ్లిస్)
యాకూత్‌పురా - ముంతాజ్ అహ్మద్ ఖాన్ (మజ్లిస్)
సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ (టీఆర్ఎస్)

7. మహబూబ్ నగర్ జిల్లా (14 నియోజకవర్గాలు)

7. మహబూబ్ నగర్ జిల్లా (14 నియోజకవర్గాలు)

మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలు ఉండగా తెరాస 13, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించారు.

కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్) (ఓటమి-రేవంత్ రెడ్డి)
మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్)
దేవరకద్ర - వెంకటేశ్వర రెడ్డి (టీఆర్ఎస్)
వనపర్తి - నిరంజన్ రెడ్డి (టీఆర్ఎస్)
అలంపూర్ - మల్లెపోగు అబ్రహం (టీఆర్ఎస్)
అచ్చంపేట - గువ్వల బాలరాజు (టీఆర్ఎస్)
షాద్ నగర్ - వై.అంజయ్య యాదవ్ (టీఆర్ఎస్)
నారాయణపేట - ఎస్ రాజేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
జడ్చర్ల - లక్ష్మారెడ్డి (టీఆర్ఎస్)
మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి (టీఆర్ఎస్)
గద్వాల - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (టీఆర్ఎస్) (ఓటమి-డీకే అరుణ)
నాగర్ కర్నూలు - మర్రి జనార్ధన్ రెడ్డి (టీఆర్ఎస్)
కల్వకుర్తి - గురక జైపాల్ యాదవ్ (టీఆర్ఎస్)
కొల్లాపూర్ - హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) (ఓటమి-జూపల్లి కృష్ణారావు)

 8. నల్గొండ జిల్లా (12 స్థానాలు)

8. నల్గొండ జిల్లా (12 స్థానాలు)

నల్గొండలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ 3చోట్ల గెలిచింది.

దేవరకొండ - రామావత్ రవీంద్ర కుమార్ (టీఆర్ఎస్)
మిర్యాలగూడ - నల్లమోతు భాస్కర రావు (టీఆర్ఎస్) (ఓటమి-ఆర్ కృష్ణయ్య)
కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్ (టీఆర్ఎస్) (ఓటమి-పద్మావతి రెడ్డి)
నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్) (ఓటమి-కోమటిరెడ్డి వెంకటరెడ్డి)
భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి (టీఆర్ఎస్)
తుంగతుర్తి - గాదరి కిషోర్ కుమార్(టీఆర్ఎస్) (ఓటమి -అద్దంకి దయాకర్)
నాగార్జున సాగర్ - నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) (ఓటమి-జానారెడ్డి)
హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
సూర్యాపేట - జగదీశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్)
మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్)
నకిరేకల్ - చిరుముర్తి లింగయ్య (కాంగ్రెస్)
ఆలేరు - గొంగిడి సునీత (టీఆర్ఎస్)

 9. వరంగల్ జిల్లా (12 స్థానాలు)

9. వరంగల్ జిల్లా (12 స్థానాలు)

వరంగల్ జిల్లాలో 12 సీట్లు ఉండగా తెరాస 10 సీట్లు, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది.

జనగాం - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (టీఆర్ఎస్) (పొన్నాల లక్ష్మయ్య ఓటమి)
ఘనపూర్ - తాటికొండ రాజయ్య (టీఆర్ఎస్)
పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర రావు (టీఆర్ఎస్)
డోర్నకల్ - రెడ్యా నాయక్ (టీఆర్ఎస్)
మహబూబాబాద్ - బానోతు శంకర్ నాయక్ (టీఆర్ఎస్)
నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి (టీఆర్ఎస్)
పరకాల - చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్) (కొండా సురేఖ ఓటమి)
వరంగల్ వెస్ట్ - దాస్యం వినయ భాస్కర్ (టీఆర్ఎస్)
వరంగల్ ఈస్ట్ - నరేందర్ నన్నపనేని (టీఆర్ఎస్)
వర్ధన్నపేట - ఆరూరి రమేష్ (టీఆర్ఎస్)
భూపాలపల్లి - గండ్ర వెంకట రమణా రెడ్డి (కాంగ్రెస్)
ములుగు - సీతక్క (కాంగ్రెస్) (చందూలాల్ ఓటమి)

10. ఖమ్మం జిల్లా (10 స్థానాలు)

10. ఖమ్మం జిల్లా (10 స్థానాలు)

ఖమ్మం జిల్లాలో మహాకూటమి 8 చోట్ల, తెరాస 1చోట, స్వతంత్రులు 1చోట గెలిచారు.

పినపాక - కాంతారావు రేగ (కాంగ్రెస్)
ఖమ్మం - అజయ్ కుమార్ పువ్వాడ (టీఆర్ఎస్)
మధిర - మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్)
సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ)
అశ్వారావుపేట - నాగేశ్వర రావు (టీడీపీ)
ఇల్లందు - హరిప్రియ బానోతు (కాంగ్రెస్)
పాలేరు - ఉపేందర్ (కాంగ్రెస్) (ఓటమి - తుమ్మల నాగేశ్వర రావు)
వైరా - రాములు (ఇండిపెండెంట్)
కొత్తగూడెం - వనమా వెంకటేశ్వర రావు (కాంగ్రెస్)
భద్రాచలం - పోదెం వీరయ్య (కాంగ్రెస్)

English summary
K Chandrashekar Rao's TRS party is sweep Telangana Assembly polls as predicted by the poll of exit polls for the state. The Telugu Desam Party-Congress alliance saw a rather humiliating defeat in the 40 member assembly that voted on December 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X