తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక(మున్సిపల్) ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ నోటిఫకేషన్ ఆదివారం జారీ అయ్యింది. మేయర్, ఛైర్ పర్సన్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 7,8 ఉత్తర్వులను పురపాలక శాఖ విడుదల చేసింది.
కాగా, ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. 120 పురపాలక సంఘాలు, 10 నగర పాలక సంస్థలకు ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వార్డులను రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేసింది. బీసీలకు 29.40 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 5.83 శాతం, ఎస్సీలకు 14.15 శాతం దక్కాయి.

కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్లు
జనరల్(మహిళ): గ్రేటర్ హైదరాబాద్, బోడుప్పల్, బడంగ్ పేట్, కరీంనగర్
జనరల్: పీర్జాదిగూడ, నిజాంపేట్, ఖమ్మం
బీసీ(మహిళ): నిజామాబాద్, జవహర్ నగర్
ఎస్సీ: రామగుండం
ఎస్సీ: మీర్‌పేట
జనరల్:
మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, నల్గొండ, చిట్యాల, కొత్తపల్లి, ఇల్లెందు, అచ్చంపేట, భూత్పూర్, లక్షెట్టిపేట, జమ్మికుంట, కాగజ్ నగర్, కల్వకుర్తి, షాద్ నగర్, తుక్కుగూడ, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కోంపల్లి, నాగారం, తూముకుంట, బొల్లారం, మణికొండ, జల్‌పల్లి, హాలియా, పోచారం, దమ్మాయిగూడ, ఆదిభట్ల, ఆదిలాబాద్,
జనరల్ (మహిళ):
శంకర్ పల్లి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్ కేసర్, మేడ్చల్, నందికొండ, తుర్కయాంజల్, గుండ్లపోచంపల్లి, సిద్దిపేట, హుజురాబాద్, చొప్పదండి, పెద్దపల్లి, వేములవాడ, కొత్తకోట,చేర్యాల, తెల్లాపూర్, దుబ్బాక, మోత్కూర్, ఆత్మకూర్, కామారెడ్డి, తాండూర్, కోదాడ, చెన్నూరు దుండిగల్, జనగామ, నాగర్ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హూజూర్నగర్
బీసీ:
బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర,ఖానాపూర్, కొడంగల్, తూప్రాన్, పరిగి, వనపర్తి, అమరచింత, అందోల్-జోగిపేట, రామాయంపేట, చౌటుప్పల్, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల
బీసీ (మహిళ):
బోధన్, సదాశివపేట, చండూర్, భీంగల్, ఆర్మూర్, కోస్గీ, నారాయణ్ ఖేడ్, మెట్ పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, సిరిసిల్ల, నారాయణ్ పేట, కోరుట్ల
ఎస్సీ:-
క్యాతన్ పల్లి, వైరా, అయిజ, నస్పూర్, తొర్రూర్, నేరేడ్ చర్ల, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, నార్సింగి
ఎస్సీ (మహిళ):-
భూపాల్ పల్లి, పెద్ద అంబర్ పేట్, తిరుమల్‌గిరి, వడ్డేపల్లి, పరకాల, మధిర, పెబ్బేరు, అలంపూర్
ఎస్టీ: డోర్నకల్, ఆమన్‌గల్
ఎస్టీ (మహిళ): మరిపెడ, వర్ధన్నపేట
కాగా, జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 22న ఎన్నికలు, 24న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదలవుతాయి.