వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుపల్లికి గవర్నర్ పదవి: బాబు హమీ ఎందుకు ఇచ్చాడో తెలుసా?

చాలా కాలంగా గవర్నర్ పదవి దక్కుతోందని ఆశిస్తోన్న తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహ్ములు పేరు మరోసారి తెరమీదికి వచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చాలా కాలంగా గవర్నర్ పదవి దక్కుతోందని ఆశిస్తోన్న తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహ్ములు పేరు మరోసారి తెరమీదికి వచ్చింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని భావిస్తోంది. ఈ తరుణంలో మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ పదవి కోసం మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్‌డిఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది. ఈ తరుణంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉంది.

మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవిని ఇవ్వాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రధానమంత్రి మోడీని కోరారు. మోడీ కూడ సానుకూలంగా స్పందించారు.అయితే ఇటీవల వెంకయ్యనాయుడును అభినందించేందుకు వెళ్ళిన తెలంగాణ టిడిపి నేతలకు వెంకయ్యనాయుడు కూడ మోత్కుపల్లికి త్వరలో శుభవార్త అందే అవకాశం ఉందని చెప్పారు.

త్వరలోనే కేంద్రం కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ పదవులను నియమించనుంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల్లో కొత్తగా గవర్నర్లను నియమించే సమయంలో మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని వెంకయ్యనాయుడు టిడిపి నేతల వద్ద ప్రస్తావించారు.

మోత్కుపల్లికి గవర్నర్ పదవి వెనుక

మోత్కుపల్లికి గవర్నర్ పదవి వెనుక

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాలు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి విషయమై చంద్రబాబునాయుడు నుండి హమీ లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలకు ముందు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి నుండి అభ్యర్థులను ఖరారు చేసే సమయంలో మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి మోహన్‌రావు పేర్లు తెలంగాణ నుండి టిడిపి పరిశీలించింది.అయితే ఆ సమయంలో రెండు ప్రాంతాలకు చెందిన నేతలు కూడ మోత్కుపల్లి నర్సింహులు పేరును ప్రతిపాదించారు. అయితే పార్టీ అవసరాల రీత్యా గరికపాటి మోహన్‌రావుకు చంద్రబాబునాయుడు రాజ్యసభ పదవిని ఇచ్చేందుకు మొగ్గుచూపారు.ఆ సమయంలో మోత్కుపల్లి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీపై తన నిరసనగళం విప్పేందుకు మీడియా ముందుకు వచ్చిన మోత్కుపల్లి నర్సింహులును ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో విప్‌గా ఉన్న అప్పటి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మీడియా వద్ద నుండి మోత్కుపల్లిని తీసుకెళ్ళారు.టిడిపి సీనియర్లు గాలి ముద్దుకృష్ణమనాయుడు సహ కొందరు టిడిపి నేతలు మోత్కుపల్లితో చర్చించారు.ఈ సమయంలోనే గవర్నర్ పదవిని ఇప్పిస్తామని బాబు మోత్కుపల్లికి హమీ ఇచ్చారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మధిర నుండి పోటీచేసే అవకాశం కల్పించారు.మధిరలో జరిగిన ఎన్నికల్లో మోత్కుపల్లి ఓటమిపాలయ్యారు.

Recommended Video

Telangana Governor inaugurates 65 beds at Gandhi Hospital's ICU
త్వరలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి

త్వరలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి

ప్రధానమంత్రి మోడీ కేబినెట్ ప్రక్షాళనకు నడుం బిగించారు. అదే సమయంలో పలురాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని భావిస్తోంది.ప్రస్తుతం బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌హావేలీకి కొత్తగా గవర్నర్లను నియమించాల్సి ఉంది. ఈ రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల గవర్నర్లు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే సమయంలో మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్‌గా బాధ్యతలను దక్కే అవకాశం కన్పిస్తోంది.

గవర్నర్లు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది.

కేంద్ర మంత్రులను గవర్నర్లుగా పంపేందుకు సన్నాహలు

కేంద్ర మంత్రులను గవర్నర్లుగా పంపేందుకు సన్నాహలు

ప్రస్తుతం కేంద్రమంత్రులుగా ఉన్న కొందరిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపాలని కేంద్రం యోచిస్తోంది.కేంద్ర మంత్రులు కల్‌రాజ్ మిశ్రా, లాల్జీ టాండన్, విజయ్‌కుమార్ మల్హోత్రా, కైలాస్ జోషీ, ఆనందీ‌బెన్ పటేల్, సీపీ ఠాకూర్, జితిన్ రామ్ మాంఝీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిని రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే అదే సమయంలో తెలంగాణ టీడీపీ సీనియర్ నేత అయిన మోత్కుపల్లికి ఈసారి గవర్నర్ గిరీ ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఏపీ, తెలంగాణకు కాకుండా మరో రాష్ట్రానికి ఆయనను పంపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాకుండా ఈశాన్య రాష్ట్రాలకు నర్సింహులును గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నట్టు టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.

గవర్నర్ పదవి ఇవ్వాలని మోడీకి బాబు

గవర్నర్ పదవి ఇవ్వాలని మోడీకి బాబు

తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవిని ఇవ్వాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీకి బాబు విన్నవించారు. ఈ విషయమై మోడీ కూడ సానుకూలంగా స్పందించారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రం నుండి గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ప్రస్తుత కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు టిడిపి అవకాశం కల్పించింది. ఎన్‌డిఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉన్నందున మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

English summary
The Telugu Desam is confident of its senior party leader in Telangana, M. Narasimhulu, getting a gubernatorial post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X