వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగ బద్దంగా పని చేస్తానన్న కొత్త గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ ...

|
Google Oneindia TeluguNews

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. కొన్ని నెలల క్రితం సీనియర్ రాజకీయ నాయకుడు, బిజెపిలో కీలకంగా పనిచేసిన నేత బిశ్వ భూషణ్ హరి చందన్ ను ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమించారు. ఇక తాజాగా తెలంగాణ బిజెపి నాయకుడు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గానూ, తెలంగాణ లో పనిచేస్తున్న ఈయన నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన బిజెపి నాయకురాలు తమిళ సై సౌందరరాజన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

ప్రకాశం బ్యారేజ్ కి మళ్ళీ వరద .. ఈ సారి తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే కారణంప్రకాశం బ్యారేజ్ కి మళ్ళీ వరద .. ఈ సారి తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే కారణం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళ సై సౌందరరాజన్ ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 10న గవర్నర్ నరసింహన్ గవర్నర్ గా ఇంతకాలం తన నిర్వర్తించిన బాధ్యతల నుండి విరమణ పొందనున్నారు. తెలంగాణ రాష్ట్రం తో ముడిపడిన అనుబంధంపై ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం చెన్నైలోని నివాసంలోనే ఉంటానని చెప్పారు. వడ సాంబార్ తింటూ.. కాలక్షేపం చేస్తానని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కాగా.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు.

Telangana New Governor TamiliSai Soundararajan take the oath on 11th of this month

ఇక దీంతో ఈనెల 11న తమిళ సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళనాడులో జన్మించిన తమిళ సై సౌందరరాజన్ తెలుగు ప్రజల పట్ల కూడా అంతే సహజం భావంతో మెలుగుతానని ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు తెలుగు సోదర , సోదరీమణులతో అనుబంధాన్ని పంచుకోగలగడం తన అదృష్టం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఎప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను గానీ తాను కలవలేదని వెల్లడించారు. ఒకసారి ఫోన్ లో మాత్రం సంభాషించానని ఆమె పేర్కొన్నారు. ఇక తాను రాజకీయాల కోసం కాదు రాజ్యాంగబద్ధంగా పనిచేయడం కోసం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వస్తున్నానని ఆమె వెల్లడించారు.

English summary
Tamil Nadu BJP leader Tamilisai Soundarrajan, who has been appointed as the new governor of Telangana state is gearing up to take the charge. Now, the news is that Soundarrajan will take the oath from the 11th of this month.She said that fortunate to share the brotherly and sisterly relationship with Telangana in the same manner as she used to share in Tamilnadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X