వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు కొత్త సెక్రటేరియట్ అక్కడే... శంకుస్థాపన ముహుర్తం జూన్ 27..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణనికి ముహుర్తం ఖారరైనట్టు తెలుస్తోంది. జూలై నెల ఆషాడమాసం కావడంతో.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమీ పూజ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణకు అప్పగించిన ఏపీ భవనాల్లో ఉన్న ఫైళ్లను సైతం ఏపి అధికారులు తరలిస్తున్నారు. తరలింపుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ,ఏపీ అధికారులు సమావేశమయ్యారు.

ఏపీ భవనాల్లో కొనసాగనున్న తెలంగాణ సెక్రటేరియట్

ఏపీ భవనాల్లో కొనసాగనున్న తెలంగాణ సెక్రటేరియట్

ఎట్టకేలకు తెలంగాణ సెక్రటేరియట్‌ పునర్మిణానికి ముహుర్తం ఖారరైనట్టుగా తెలుస్తోంది. మరో పదిహేను రోజుల్లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ పునాది వేయనున్నారు. భూమిపూజ కోసం కావాల్సిన ఏర్పాట్లను సైతం కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను తెలంగాణ కేటాయించేందుకు ఏపీ సీఎం జగన్‌ అంగీకరించడంతో గవర్నర్ నర్సింహన్ అందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడ విడుదల చేశారు. ఇందులో భాగాంగానే ముందుగా ఏపి సెక్రటేరియట్‌ను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.భవనాల కేటాయింపుకు సంబంధించి ఏపీ,తెలంగాణ అధికారులు నేడు సమావేశమయ్యారు. దీంతో ఏపి సెక్రటేరియట్ ‌లో ఉన్న ఫర్నిచర్, ఇతర ఫైళ్లు తరలిస్తున్నారు.

జూన్ 27న కొత్త సెక్రటేరియట్‌కు భూమి పూజ

జూన్ 27న కొత్త సెక్రటేరియట్‌కు భూమి పూజ

కాగా ఏపి భవనాలు తెలంగాణ స్వాధీనం చేసుకున్న తర్వాత కోన్ని పరిపాలన పరమైన భవనాల్లోకి తెలంగాణకు చెందిన విభాగాలు తరలించనున్నారు. ఆ వెంటనే ప్రస్థుతం కొనసాగుతున్న తెలంగాణ సెక్రటేరియట్ భవనాలు కూల్చి వేసి అక్కడే కొత్త భవనాలను నిర్మించన్నారు. ఇందుకు సంబంధించి రూపోంచించిన్ ప్లాన్ కూడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.దీంతో అన్ని సజావుగా కొనసాగితే ఈనెల 27నే భూమి పూజ కూడ పూర్తి చేయనున్నారు.

వాస్తుదోషంతో సెక్రటేరియట్‌కు రాని సీఎం కేసీఆర్

వాస్తుదోషంతో సెక్రటేరియట్‌కు రాని సీఎం కేసీఆర్

కాగా తెలంగాణ రాష్ట్ర్రం ఎర్పాటు అయిన తర్వాత కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేయాలని సీఎం కేసీఆర్ భావించారు.ఇందుకోసం ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. అయితే ఎక్కువగా ట్రాఫిక్ సంబంధమైన సమస్యలు వస్తాయనే నేపథ్యంలో దాన్ని విరమించుకున్నారు. ఇక సికింద్రాబాద్‌లోని జింఖాన గ్రౌండ్‌కు స్థలంలో సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరింది. కాని కేంద్రం దీనిపై విముఖత వ్యక్తం చేయడంతో చివరకు పాత సెక్రటేరియట్ స్థానంలోనే కొత్త భవనాలను నిర్మించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దమైంది.కాగా సెక్రటేరియట్‌కు వాస్తు దోషం ఉందంటూ సీఎం కేసీఆర్ సేక్రటేరియట్‌లొ కాకుండా తన అధికారిక కార్యక్రమాలను సీఎం క్యాంప్ కార్యాలయం నుండే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే..

English summary
Telangana new secretariat construction may be started soon . Chief Minister KCR is going to pooja to the Secretariat on june 27th. On the other hand, Telangana and AP officials are discussing issues related to evacuation buildings which is allocated to ap
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X