వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా సెక్రటేరియట్ కొత్త డిజైన్: నిజామాబాద్ జిల్లాలోని ఆ ఆలయ స్పూర్తితో!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించడానికి పాత సచివాలయ భవనాన్ని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను తయారు చేసింది. ఆరు అంతస్తులతో కొత్త తెలంగాణ సచివాలయాన్ని అందంగా తీర్చి దిద్దింది. దీనికి సంబంధించిన డిజైన్ విడుదల చేసిన ప్రభుత్వం విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే కొత్త సచివాలయ డిజైన్ మసీదులా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి . ఆ డిజైన్ ఒక ఆలయ స్ఫూర్తితో చేసిన డిజైన్ అని రూపకర్తలు ప్రకటించటంతో ఆ ఆలయం ఎక్కడ అని సర్వత్రా చర్చ మొదలైంది.

నిజామాబాద్ జిల్లాలోని ఆలయ స్పూర్తితో కొత్త సచివాలయ డిజైన్

నిజామాబాద్ జిల్లాలోని ఆలయ స్పూర్తితో కొత్త సచివాలయ డిజైన్

రాష్ట్రంలో ఇప్పుడు హ‌ట్ టాఫిక్ గా మారిన తెలంగాణ సెక్ర‌ట‌రియేట్ కొత్త డిజైన్ నిజామాబాద్ జిల్లాలోని ఓ ఆల‌య స్పూర్తి నుండి ఏర్ప‌డిందని రూప‌క‌ర్త‌లు ప్ర‌క‌టించ‌డం ఆసక్తికరంగా మారింది. ఎన్నో మోడ‌ల్స్, డిజైన్ల‌ను ప‌రీశీలించిన తెలంగాణ స‌ర్కార్ పైన‌ల్ గా విడుద‌ల చేసిన డిజైన్ నిజామాబాద్ జిల్లాలోని ఓ శైవాల‌యం స్పూర్తి తో వ‌చ్చిన డిజైన్ గా చెపుతున్నారు. నాలుగు శిఖ‌రాలు,దీర్ఘ‌ చ‌తుర‌స్ర‌కార నిర్మాణం ఇవ‌న్ని నిజామాబాద్ లోని ఓ ఆల‌య పోలిక‌లు.. ఇంత‌కి ఆ ఆల‌యం ఎక్క‌డ.. దాని విశేషాలు ఏమిటి అంటే

కొత్త సచివాలయ డిజైన్ మసీదులా ఉందని విమర్శలు

కొత్త సచివాలయ డిజైన్ మసీదులా ఉందని విమర్శలు

గ‌త కొంత కాలంగా కొత్త స‌చివాల‌య నిర్మాణం గురించి కసరత్తు చేస్తున్న తెలంగాణ స‌ర్కార్ హైకోర్టు నుండి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే గత మూడు రోజుల నుండి పాత స‌చివాల‌య కూల్చివేత‌ను మొద‌లు పెట్టింది. దానితో పాటు కొత్త స‌చివాల‌యం డిజైన్ ను కూడ విడుద‌ల చేయగా ఇప్పుడు ఆ డిజైన్ చర్చనీయాంశంగా మారింది . చాలా మంది మసీదును పోలిన నిర్మాణం అని విమర్శించారు. అయితే అది మసీదులా ఉన్నా, ఒక ఆలయ నిర్మాణ స్పూర్తితో తయారైన డిజైన్ అని చెప్తున్నారు.

చెన్నై కేంద్రంగా ఉన్న ఓ ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన డిజైన్

చెన్నై కేంద్రంగా ఉన్న ఓ ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన డిజైన్

తెలంగాణ నూతన సచివాలయ భవనానికి దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా, దక్కన్‌, కాకతీయుల నాటి నిర్మాణ శైలి ప్రతిబింబించేలా డిజైన్‌ను రూపొందించారు ఆర్కిటెక్ట్‌లు పొన్ని కన్సెసావో, ఆస్కార్‌ జి.కన్సెసావో దంపతులు . నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరాలయం కట్టడ కళా కౌశలం దర్శనమిచ్చేలా తీర్చిదిద్దార‌ని సమాచారం. ఈ ఇద్దరు భార్యాభర్తలకు చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్స్‌ సంస్థ సచివాలయ భవనానికి డిజైన్‌ను రూపొందించింది.

8 నెలలు శ్రమించి రూపొందించిన డిజైన్‌

8 నెలలు శ్రమించి రూపొందించిన డిజైన్‌

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ 8 నెలలు శ్రమించి రూపొందించిన ఈ డిజైన్‌కు సీఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేశారని సమాచారం. దేశంలో ఎక్కడా లేని విధంగా, దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా ఉండాలని సీఎం సూచ‌న మేర‌కు ఇది రూపొందించార‌ని తెలుస్తుంది.కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలి, దక్కన్‌ సంస్కృతి ప్రతిబింబించాలని, పచ్చదనంతో పర్యావరణహితం గా ఉండాలే డిజైన్ రూపోందించారు.గతంలో రాష్ట్రంలోని చాలా శైవాలయాలను సందర్శించిన వీరు నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయాన్ని కూడ‌ సందర్శించార‌ని టాక్ .దీంతో ప్ర‌భుత్వం ఇచ్చిన సూచ‌న‌ల‌కు ఆల‌య సూచ‌న‌ల‌కు స‌రిపోవ‌డంతో ఈ డిజైన్ ను కొత్త సెక్ర‌టేరియ‌ట్ రూప‌క‌ల్ప‌న‌లో స్పూర్తిగా తీసుకున్నారు ఈ ఆర్కిటెక్చర్స్.

Recommended Video

Telangana New Secretariat పై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రజాధనం వృథా | MLA Jagga Reddy ఆవేదన...!!
శాతవాహనుల కాలం నాటి నిర్మాణం నీలకంఠేశ్వరాలయం

శాతవాహనుల కాలం నాటి నిర్మాణం నీలకంఠేశ్వరాలయం

ఈ నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయ నిర్మాణం అపురూపంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని శాతవాహన రాజైన శాతకర్ణి-2 నిర్మించారు. జైనుల కోసం నిర్మించిన ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో శైవాలయంగా మార్చారు. 1500 ఏళ్ల నాటి ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది...ఈ ఆల‌యానికి నాలుగు శిఖ‌రాల‌తో పాటు ఉత్త‌ర దిక్కున కోనేరు కూడ ఉంది..మంచి వేంటిలేష‌న్ తో పాటు 100 శాతం వాస్తుతో ఈ ఆల‌యాన్ని నిర్మించారు.

నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయ మోడల్ తెలంగాణా కొత్త సెక్రటేరియట్

నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయ మోడల్ తెలంగాణా కొత్త సెక్రటేరియట్

ఈ ఆలయానికి 1400-1500 ఏళ్ల చ‌రిత్ర ఉందని తెలుస్తుంది . ఆల‌యంలో పూర్తి స్థాయిలో జైన, బుద్ద మ‌త అనవాళ్లు క‌నిపిస్తాయంటున్నారు. ఆల‌యం ఇప్ప‌టికి చెక్కు చెద‌ర‌లేదు. తెలంగాణ స‌ర్కార్ నీల‌కంఠేశ్వ‌రాల‌య‌న్ని పోలి ఉన్న డిజైన్ కు ఆమోద‌ముద్ర వేయ‌డం ఈ ఆల‌యానికి ద‌క్కిన ఖ్యాతిగా చెపుతున్నారు.మొత్త‌నికి తెలంగాణ ప్ర‌భుత్వం అమోదించిన ఈ డిజైన్ తో ఇప్పుడు నీల‌కంఠేశ్వ‌రాల‌యం హ‌ట్ టాపిక్ గా మారింది.ఆల‌యానికి ఈ గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు నిజామాబాద్ వాసులు .

English summary
It is interesting to note that the designers announced that the new design of the Telangana Secretariat,was inspired by a temple in Nizamabad district. The design released by Telangana govt, which has examined many models and designs, is inspired by a Sivayalayam in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X