వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్: సర్వే.. 85 సీట్లు టీఆర్ఎస్‌వే, చంద్రబాబుకే భారీ దెబ్బ

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణలో గెలుపు పైన పలు సంస్థలు సర్వే

హైదరాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంలతో పాటు తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో గెలుపు పైన పలు సంస్థలు చేసిన సర్వేలను క్రోఢీకరించి ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపినీయన్ పోల్స్‌ను ప్రకటించింది.

ఇందులో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని తేలింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 85 సీట్లు వస్తాయని పలు సర్వేలు వెల్లడించాయి. టీమ్ ప్లాష్, వీడీఏ అసోసియేట్స్, సీ ఓవటరు, ఐటీ టెక్ గ్రూప్, టైమ్స్ నౌ సర్వేల్లో తెరాస గెలుస్తుందని తేలింది. ఈ సర్వేలను క్రోఢీకరించి మంగళవారం ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది.

కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!

గతంలో కంటే 25 సీట్లు ఎక్కువ, ఇప్పుడున్న వాటికంటే తక్కువ

గతంలో కంటే 25 సీట్లు ఎక్కువ, ఇప్పుడున్న వాటికంటే తక్కువ

119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం 60 సీట్లు. ఈ సాధారణ మెజార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లు ఎక్కువగా వస్తాయని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ వెల్లడించింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ఇది వెల్లడించింది.

85 సీట్లు టీఆర్ఎస్‌కు 85 సీట్లు

85 సీట్లు టీఆర్ఎస్‌కు 85 సీట్లు

టీఆర్ఎస్ పార్టీకి 85 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 18 స్థానాలు, మజ్లిస్ పార్టీకి 7 స్థానాలు, బీజేపీకి 5 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి (పార్టీలో చేరిన వారితో కలిపి) దాదాపు వందమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలిచింది. గతంలో గెలిచిన దానికంటే ఎక్కువ, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల కంటే తక్కువ స్థానాలు తెరాసకు వస్తాయి.

ఎవరికి దెబ్బ అంటే గతంలో కంటే ఎవరికి దెబ్బ అంటే

ఎవరికి దెబ్బ అంటే గతంలో కంటే ఎవరికి దెబ్బ అంటే

తెలంగాణలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 21, మజ్లిస్ 7, తెలుగుదేశం 15, బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది. అయితే ఈసారి మజ్లిస్, బీజేపీలు గతంలో గెలిచిన స్థానాలే గెలవనున్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే రెండు మూడు సీట్లు తక్కువగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎక్కువ సీట్లు దక్కించుకోనుంది. ఎందుకంటే పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు.

పెద్ద దెబ్బ టీడీపీకే గతంలో కంటే పెద్ద దెబ్బ టీడీపీకే

పెద్ద దెబ్బ టీడీపీకే గతంలో కంటే పెద్ద దెబ్బ టీడీపీకే

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఆ పార్టీ ఒకటి రెండు స్థానాల్లో లేదంటే ఆ సీట్లు కూడా గెలిచే అవకాశాలు లేదని సర్వేలో వెల్లడైంది. దీనిని బట్టి గత ఎన్నికల కంటే అందరికంటే పెద్ద దెబ్బ తెలుగుదేశం పార్టీకే అని అర్థమవుతోంది.

కేటీఆర్ ట్వీట్

ఈ ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో తెరాసకు తిరుగులేని విజయం ఖాయమని సంకేతాలు ఇచ్చిందని, తెరాస విజయం సాధిస్తుందని గత మూడు వారాల వ్యవధిలో వచ్చిన ఐదవ తటస్థ మీడియా/ఏజెన్సీ సర్వే అని కేటీఆర్ పేర్కొన్నారు.

English summary
Telangana Rashtra Samithi, a local party, will emerge as the big winner, leaving both Congress and the BJP far behind. The TRS is expected to win 85 of the state's 117 seats -- the majority mark is at 60. The Congress is expected to get 18 seats, the BJP 5 and the local AIMIM 7 seats, shows the aggregate of the opinion polls conducted by The Team Flash and VDA Associates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X