హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబ్బులిచ్చే అత్యాచారానికి పాల్పడ్డా: మాదాపూర్ బాలిక రేప్ కేసు నిందితుడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను బాధితురాలి సోదరికి డబ్బులు చెల్లించే 14ఏళ్ల బాలికతో శృంగారం చేశానని మాదాపూర్ రేప్ కేసులో నిందితుడైన దిలీప్ సర్కార్(39) చెబుతున్నాడు. కాగా, నిందితుడు అత్యాచారానికి పాల్పడటంతో ఆ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. గత నవంబర్‌లో పాఠశాలలోనే ఆమె ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, తనకు బాలిక మైనర్ అని తెలుసునని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని డబ్బులు ఇచ్చానని నిందితుడు దిలీప్ తెలిపాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన దిలీప్‌ను గత ఆదివారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాంటీన్ నడుపుకుంటూ కొండాపూర్‌లో జీవిస్తున్న ఇతనికి ఒక భార్య, పిల్లలు ఉన్నారు.

నిందితుడు దిలీప్ బాధిత బాలిక అక్కతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. కిరాణ దుకాణం నడుపుతున్న ఆమె ఇంటికి తరచూ వెళ్లేవాడు దిలీప్. ఈ క్రమంలో ఆమెతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.

Telangana: Paid money to victim’s kin, claims rape accused

ఈ క్రమంలో తరచూ ఆమె ఇంటికెళ్లిన నిందితుడు ఆమె సోదరిపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం కూడా బాధితురాలి అక్కకు తెలిసే ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పాఠశాలలో బాధిత బాలిక ఓ పాపకు జన్మినిచ్చే వరకూ ఈ విషయంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని భావిస్తున్నారు. బాధిత బాలిక ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాతే ఆమె అక్క, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

తమ విచారణలో కూడా బాధితురాలి అక్క ఈ ఘటనపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అయితే, దిలీప్ నుంచి డబ్బులు తీసుకోలేదని ఆమె తెలిపింది. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

English summary
Madhapur rape accused Dilip Sarkar, 39, has claimed that he had paid a woman to have sex with her 14-year-old sister, who became pregnant as a result. The minor delivered her baby in school in November last. He told the police that he knew the victim was a minor, but paid money to keep it a secret.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X