వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ' టిఆర్ఎస్‌కు ఇబ్బందేనా?: గ్రేటర్‌పై కెసిఆర్ ఆరా, హరీష్ గైర్హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మంత్రులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌లో పార్టీ పరిస్థితి పైన ఆరా తీశారు. నియోజకవర్గాలవారీగా పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకీ హరీష్ రావు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారని తెలుస్తోంది. ఆయన నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రాలేదని తెలుస్తోంది. గ్రేటర్లో అభ్యర్థుల ప్రకటనలకు ముందు ఉన్నంత ఊపు ఇప్పుడు కనిపించడం లేదని కెసిఆర్ దృష్టికి పలువురు తెచ్చినట్లుగా తెలుస్తోంది.

'Telangana' parties to split TRS' vote bank?

విశ్వనగరంగా ఎలా సాధ్యం: జెపి

తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యలు, నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా విశ్వనగరంగా ఎలా సాధ్యమని వన్ హైదరాబాద్ కూటమి.. సిపిఐ, సిపిఎం, లోక్‌సత్తా, ఎంసిపిఐ నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశ్నించారు.

రాఘవులు, చాడ వెంకట రెడ్డి, జెపి, తమ్మినేని సీతారాం తదితరులు మాట్లాడారు. సిఎం కెసిఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తానే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, తారసలు కలిస్తే ఎలాంటి మార్పు ఉండదన్నారు.

ప్రజల్లో మార్పు కోసం జీవితాంతం కృషి చేసి, నిజాయితీగా బతుకుతున్న వామపక్ష, లోక్‌సత్తా కూటమి కావాలా లేక ఎన్నికలు, పదవులను నిచ్చెనగా వేసుకొని సకల సౌకర్యాలు సొంతం చేసుకోవాలనుకుంటున్న వారు కావాలో ప్రజలు తేల్చుకోవాల్నారు.

'తెలంగాణ' ఓటు బ్యాంక్ చీల్చుతుందా?

తెలంగాణ రాష్ట్ర సమితి ఓటు బ్యాంకును 'తెలంగాణ' పార్టీలు చీల్చుతాయా అనే చర్చ సాగుతోంది. తెలంగాణ పార్టీ.. అంటే ఆ పదంతో ఉన్న పార్టీలు తెరాస ఓటు బ్యాంకును చీల్చవచ్చునని చాలామంది భావిస్తున్నారు.

అధికారంలో టిఆర్ఎస్ ఉంది. దీని పూర్తి పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. అదే తెలంగాణ పేరుతో మరో పదిహేను పార్టీలు ఉన్నాయి. ఇందులో పలు పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికల పోటీలో కొన్నిచోట్ల నిలుస్తున్నాయి. అయితే, అందరికీ కారు గుర్తు తెలుసునని, చీలిక సమస్యే ఉండదని మరికొందరు చెబుతున్నారు.

తెలంగాణ పేరుతో ఉన్న పార్టీలు... ప్రజా తెలంగాణ సమితి, సామాజిక తెలంగాణ పార్టీ, తెలంగాణ భారత్ జనతా పార్టీ, తెలంగాణ రాజ్యసమితి పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ, తెలంగాణ ఇక్యా జన్ పార్టీ, తెలంగాణ లేబర్ పార్టీ, తెలంగాణ లోకసత్తా పార్టీ, తెలంగాణ యువసేన పార్టీ, తెలంగాణ యువశక్తి పార్టీ, యువ తెలంగాణ పార్టీలు ఉన్నాయి.

English summary
Telangana' spells trouble for TRS as 15 registered political parties have the new state as part of their titles in the GHMC polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X