వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌లు ఓపెన్ -సర్కారు ఉత్తర్వులు -టాలీవుడ్‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్లు

|
Google Oneindia TeluguNews

ఎనిమిది నెలల తర్వాత తెలంగాణలో మళ్లీ సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తెరుచుకోనున్నాయి. కరోనా మహమ్మారి భయాలు పూర్తిగా తొలగిపోనప్పటికీ.. సినీ పరిశ్రమను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్.. టాలీవుడ్ పెద్దలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, గ్రేటర్ ఎన్నికల టీఆర్ఎస్ మేనిఫెస్టోలోనూ తెలుగు సినీ పరిశ్రమకు భారీ ఎత్తున తాయిలాలు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రంచంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

మంగళవారమే బొమ్మ పడుద్ది..

మంగళవారమే బొమ్మ పడుద్ది..

రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు అనుమతులిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం(నవంబర్ 24) నుంచే థియేటర్లు, మల్టిపెక్స్ లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొనడంతో నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు.. టికెట్ల ధరను పెంచుకునే అధికారాన్ని కూడా యాజమాన్యాలకు కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు చెప్పారు. అయితే..

పేదోడి పెళ్లాం ఊరందరికీ మరదలే -ఎంఐఎం చీఫ్ ఓవైసీ అనూహ్యం -నిలదీసిన మహిళలు, ఎంపీ జంప్పేదోడి పెళ్లాం ఊరందరికీ మరదలే -ఎంఐఎం చీఫ్ ఓవైసీ అనూహ్యం -నిలదీసిన మహిళలు, ఎంపీ జంప్

ఇవీ నిబంధనలు..

ఇవీ నిబంధనలు..

మంగళవారం నుంచే తెలంగాణ వ్యాప్తంగా సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లు తెరుచుకోనున్నా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తప్పనిసరి నిబంధనలను విధించింది. వాటిలో ప్రధానమైనవి.. థియేటర్ లో పనిచేసే వ్యక్తులు మొదలుకొని, సినిమాలు చూడటానికి వచ్చే ప్రేక్షకుల దాకా ప్రతి ఒక్కరూ మస్ట్ గా మాస్కులు ధరించాలి. శానిటైజర్‌ తప్పనిసరిగా వాడాలి. భౌతిక దూరం నిబంధనలు తప్పక పాటించాలి. సీటింగ్ విషయంలో, లోపలికి బయటికి వెళ్లే సమయంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది. థియేటర్ హాల్‌లో ఏసీ టెంపరేచర్‌ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలోనూ టీఆర్ఎస్ పార్టీ.. టాలీవుడ్ కు బంపర్ ఆఫర్లను హామీగా ఇచ్చింది..

టాలీవుడ్‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్లు..

టాలీవుడ్‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్లు..

టీఆర్ఎస్ గ్రేటర్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ సోమవారం విడుదల చేశారు. అందులో సినీ రంగానికి సంబంధించి కీలక అంశాలను పేర్కొన్నారు. కరోనా విలయం, లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 40వేల మంది సినీకార్మికులను ఆదుకుంటామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. పేద సినీ కార్మికులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పింది. చిన్న సినిమాలపై వేలాది మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు ఆధారపడ్డారని గుర్తుచేస్తూ.. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే చిన్న సినిమాలకు జీఎస్టీని మినహాయిస్తున్నామని, మార్చి నుంచి ఇప్పటివరకూ 9 శాతం పన్ను రద్దు చేస్తున్నామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించారు. అంతేకాదు.. థియేటర్ల యజమానులకు కనీస మెయింటెనెన్స్ చెల్లింపులు, కరెంట్ బిల్లులు రీఇంబర్స్ మెంట్ కూడా ఇస్తామని మేనిఫెస్టోలో వాగ్ధానం చేశారు.

Recommended Video

GHMC Elections 2020 : CM KCR Meeting With TRS Party Leaders | విజయం పై ధీమా!!
ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..

ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..

చిరంజీవి, నాగార్జున సహా పలువురు టాలీవుడ్ పెద్దలు ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన మరుసటి రోజే మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు భారీ ఎత్తున తాయిలాలు ప్రకటించడం గమనార్హం. హైదరాబాద్ లోని తెలుగు చిత్రపరిశ్రమ... ఇండియాకి ఫిలింహబ్ అవుతుందన్న సీఎం కేసీఆర్.. చిత్ర పరిశ్రమను మరింతగా ఆదుకునే విషయంలో త్వరలోనే సినీపెద్దలతో మరోసారి భేటీ అవుతానని ప్రామిస్ చేశారు. గ్రేటర్ ఎన్నికల వేళ టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తుండటం తెలిసిందే. తాజాగా మేనిఫెస్టోలోనూ కేసీఆర్ వరాలు ప్రకటించడం ద్వారా టాలీవుడ్ మొత్తం టీఆర్ఎస్ వెంటనే ఉంటుందనే సంకేతాలిచ్చారు.

English summary
The Telangana government on Monday has permitted with immediate effect reopening of cinemas, theatres and multiplexes with up to 50 per cent of their seating capacity, in areas outside containment zones. cm kcr also promises All Help To Telugu Film Industry in trs ghmc election manifesto
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X