వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓయుకు కెసిఆర్ ఛాన్స్‌లర్: జేఎన్టీయుకు రామేశ్వర రావు, లిస్ట్‌లో చినజీయర్ స్వామి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు, జెఎన్టీయూ - హైదరాబాద్‌కు మై హోం రామేశ్వర రావు, తెలుగు విశ్వవిద్యాలయానికి చినజీయర్ స్వామి ఛాన్స్‌లర్‌లు (సంచాలకులు) అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విశ్వవిద్యాలయాల యాక్ట్‌ను మార్చింది. గవర్నర్‌ను ఛాన్సులర్‌గా తొలగిస్తుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రాల్లోని వర్సిటీలకు కొత్త ఛాన్సులర్‌లను నియమించనుంది.

ఛాన్సులర్ కోసం ఇప్పటి వరకు కావాల్సిన అర్హతల గురించి తెలియరాలేదు. అయితే, ప్రముఖ విద్యావేత్తలు, పబ్లిక్ పర్సనాలిటీస్ తదితరులను ఛాన్సులర్‌లుగా నియమించనుందని తెలుస్తోంది.

 Telangana plans to nominate KCR as Chancellor of Osmania University

విశ్వవిద్యాలయాల సంచాలకులు, ఉప సంచాలకుల ఎంపికలో ముఖ్యమంత్రి కెసిఆర్‌దే తుది నిర్ణయం అని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి కెసిఆర్ ఓయు, కేయూలకు ఛాన్సులర్‌గా ఉండే అవకాశముందని చెబుతున్నారు.

పత్రికల్లో వస్తున్న ఊహాగానాల మేరకు... రామేశ్వర రావు జెఎన్టీయూ - హైదరాబాద్ ఛాన్సులర్‌గా, చినజీయర్ స్వామిని తెలుగు విశ్వవిద్యాలయానికి ఛాన్సులర్‌గా అపాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జెఎన్టీయూకు టెక్సాస్ ఎ అండ్ ఎం వర్సిటీ సైంటిస్ట్ జెఎన్ రెడ్డి పేరు కూడా లిస్ట్‌లో ఉందని సమాచారం. అయితే, ఏ నిర్ణయమైనా కెసిఆర్ తీసుకుంటారని చెబుతున్నారు.

English summary
If the Telangana state education ministry has its way, Chief Minister K. Chandrasekhar Rao could become the chancellor of Osmania and Kakatiya universities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X