వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ఫ్రాడ్.. 158 యాప్స్ బ్యాన్ చెయ్యాలని గూగుల్ ను కోరిన తెలంగాణా పోలీసులు .. రంగంలోకి ఈడీ

|
Google Oneindia TeluguNews

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ఫ్రాడ్ దేశం మొత్తాన్ని చుట్టేస్తున్న పరిస్థితి ఉంది. దీని వెనుక చైనీయుల హస్తం ఉందని గుర్తించిన తెలంగాణ పోలీసులు గూగుల్ ప్లే స్టోర్‌లో 158 ఇన్‌స్టంట్ ఫైనాన్సింగ్ యాప్‌లను బ్లాక్ చేయాలని గూగుల్ సంస్థను కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు తెలంగాణ పోలీసుల నుండి ఇన్‌స్టంట్ ఫైనాన్సింగ్ ఫ్రాడ్ కు సంబంధించిన సమాచారం సేకరించడం ప్రారంభించారు.

తెలంగాణాలో మళ్ళీ మావోల అలజడి .. పోలీసుల కూంబింగ్ తో ఉలిక్కిపడుతున్న ఏజెన్సీ తెలంగాణాలో మళ్ళీ మావోల అలజడి .. పోలీసుల కూంబింగ్ తో ఉలిక్కిపడుతున్న ఏజెన్సీ

 158 యాప్స్ బ్యాన్ చెయ్యాలని గూగుల్ ను కోరిన తెలంగాణా పోలీసులు

158 యాప్స్ బ్యాన్ చెయ్యాలని గూగుల్ ను కోరిన తెలంగాణా పోలీసులు


రుణాలు తీసుకున్న డిఫాల్టర్లను వేధించడం, అవమానించడం వంటి వాటి వెనుక ఉన్న కంపెనీలను గుర్తించడంతో పాటు గూగుల్ ప్లే స్టోర్ లో 158 ఇన్‌స్టంట్ ఫైనాన్సింగ్ అప్లికేషన్స్‌ను (యాప్స్) బ్లాక్ చేయాలని గూగుల్ ను కోరారు తెలంగాణా పోలీసులు . ఈ యాప్‌ల ప్రతినిధులచే వేధింపులకు గురైన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఈ 158 యాప్‌ల పాత్ర వెలుగులోకి వచ్చింది. తక్షణ ఫైనాన్సింగ్ యాప్స్ కు సంబంధించి ఇప్పటివరకు 14 మంది వ్యక్తులను అరెస్టు చేసిన తరువాత, హైదరాబాద్ పోలీసులు 42 ఫైనాన్సింగ్ యాప్స్ ను తీసివేయమని ఒక అభ్యర్థనను పంపారు.

 గూగుల్ నుండు స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్

గూగుల్ నుండు స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్


సైబరాబాద్ పోలీసులు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న మరో 116 యాప్స్ జాబితాను పంపించారు.
హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, తాము గూగుల్ నుండి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని , ఇన్‌స్టంట్ ఫైనాన్సింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఇన్‌స్టంట్ ఫైనాన్సింగ్ యాప్స్ ద్వారా వేధింపుల వల్ల ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. మొన్నటికి మొన్న ఈ ఫ్రాడ్ కేసులో చైనా దేశానికి చెందిన ఒక వ్యక్తితో పాటుగా నలుగురిని అరెస్టు చేశారు.

తాజాగా పూణేకు చెందిన కాల్ సెంటర్‌ పై రైడ్స్ .. ముగ్గురు అరెస్ట్

తాజాగా పూణేకు చెందిన కాల్ సెంటర్‌ పై రైడ్స్ .. ముగ్గురు అరెస్ట్


సైబరాబాద్ పోలీసులు వారి బ్యాంక్ అకౌంట్లో ఉన్న రెండు కోట్ల రూపాయలు చేయడంతోపాటు వారి దగ్గర నుండి రెండు ల్యాప్ ట్యాప్ లు , 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ఫ్రాడ్ కేసులో తెలంగాణ పోలీసులు రికవరీ కోసం ఆన్‌లైన్ యాప్ సంస్థలు రుణాలు తీసుకున్న వారిని వేధించటానికి పూణేకు చెందిన కాల్ సెంటర్‌ ను వేదికగా చేసుకున్నారని గుర్తించారు . అక్కడ చైనా మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పారు.

 అరెస్ట్ అయిన వారిలో మరో చైనీస్ మహిళ ... డేటా సేకరిస్తున్న ఈడీ

అరెస్ట్ అయిన వారిలో మరో చైనీస్ మహిళ ... డేటా సేకరిస్తున్న ఈడీ

అధిక వడ్డీ రేటుతో తిరిగి చెల్లించడంపై ఆన్‌లైన్ లోన్ యాప్ సంస్థలు తనను వేధించాయని హైదర్‌బాద్ నివాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా చర్యలో అరెస్టయిన వారు పూణేలోని కాల్ సెంటర్ డైరెక్టర్, అతని భార్య చైనీస్ మహిళ, కంపెనీ వ్యవహారాలను నడిపించడంలో అతనికి సహకరిస్తున్నారని, హెచ్‌ఆర్ మేనేజర్‌ ఉన్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్ చెప్పారు. హైదరాబాద్ లోనూ , గుర్గావ్ లోను, పూణే లోనూ కాల్ సెంటర్లను నిర్వహిస్తూ ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ద్వారా ఫ్రాడ్ చేసే వారి గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు తెలంగాణ పోలీసులు. ఇక వీరి నుండి ఈ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ డేటా సేకరిస్తోంది.

English summary
Google has been asked to block 158 instant financing apps on its Play Store by the Telangana police after the companies behind these were found harassing and shaming defaulters.Enforcement Directorate (ED) officials have begun gathering information from Telangana cops .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X