• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫేస్‌బుక్ కిడ్నిదోంగలు, ఆర్ధిక కష్టాలే అసరా, చివరికి బెదిరింపులు

|

ఫేస్‌బుక్ స్నేహం కొంతమోదం మరికోంత ఖేదం లా తయారైంది. ఫేస్‌బుక్ లో వ్యక్తిగత పరిచయాలు, సాంఘీక అవసరాలు ఇప్పుడు అమాయకులను నరకానికి పంపుతున్నాయి. మనుషుల అవసరాల కోసం సృష్టించిన సోషల్ మీడియా ఇప్పుడు అదే మనుష్యులను మానవత్వం లేకుండా చేస్తోంది. ఫేస్ బుక్ ను ఉపయోగించుకుని ధనవంతుల దగ్గర కోట్ల రుపాయాలు తీసుకుని ఆమాయకుల దగ్గర కిడ్నీలను దోచుకుంటున్నాయి కొన్ని ఆరాచక ముఠాలు ,దీంతో ఆ రాకెట్ ను చేధించారు తెలంగాణ పోలీసులు . అవవయదానం పేరుతో దందానడుపుతున్నా మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణానికి చెందిన గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.

ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడు ,చేయి లాగాడు, రెండు వందలు ఇచ్చి, క్షమాపణ చెప్పిన స్విగ్గీ !

సోషల్ ప్రచారం తో కిడ్ని రాకేట్,

సోషల్ ప్రచారం తో కిడ్ని రాకేట్,

రాచకోండ సీపీ మహెష్‌భగవత్ ప్రకారం హైద్రబాద్ ఎల్బీనగర్ కు చెందిన గంప రాజు ఓ ప్రైవేట్ కంపనీలో మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. చాలీచాలని జీతంతో కోట్టుమిట్టాడుతున్న కుటుంభానికి ఆర్ధిక చేయుతనిచ్చేందుకు పలు ఆన్ లైన్ సంస్థల్లో వెతుకుతున్నాడు.ఈనేపథ్యంలోనే తన ఫేస్ బుక్ అకౌంట్ లోకి ఓ ప్రకటన వచ్చింది.అది "ఇండియాలో ఓ కిడ్ని కావాలని ఉంది " ఇక వెంటనే రాజు ఆ నెంబర్ తో ఉన్న రోహాన్ మాలిక్ ఆలీయస్ సందీప్ కుమార్ తో మాట్లాడి కిడ్ని దానం వివరాలు తెలుసుకున్నారు. దీంతో రోహన్ చెప్పిన వెబ్ సైట్ ద్వార తన వివరాలు నమోదు చేశాడు .

కిడ్ని ఇస్తే 20 లక్షలు ఇస్తాం, టర్కిలో ట్రాన్స్‌ప్లాంటేషన్

కిడ్ని ఇస్తే 20 లక్షలు ఇస్తాం, టర్కిలో ట్రాన్స్‌ప్లాంటేషన్

ఇక కొద్ది రోజుల తర్వాత రాజుకు రోహన్ నుండి కాల్ వచ్చింది. అత్యవసరంగా ఒకరికి కిడ్ని కావాలని ,కిడ్ని దానం చేస్తే అక్షరాల 20 లక్షల రుపాయాలు ఇస్తామని చెప్పారు. దీంతో ఆర్ధిక అవసరాల రిత్యా డబ్బుకు ఆశపడిన రాజు ఓకే చెప్పాడు. దీంతో గత ఏడాదీ జూలైలో డిల్లిలోని నోయిడాలో ని ఓ హోటల్ లో రాజుకు ఏడు రోజుల పాటు పలు రకాల మెడికల్ టెస్టులు చేశారు. ఆనంతరం ఆయన ఒరిజినల్ పాస్ పోర్టు తీసుకుని హైద్రబాద్ పంపారు. మరోసారి మళ్లి పరీక్షలు నిర్వహించి కిడ్ని ఆపరేషన్ కోసం టర్కి వెళ్లేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు తయారు చేయించారు. కొద్ది రోజుల తర్వాత కిడ్నిని స్వీకరించే గగన్ అగర్వాల్ ను తోపాటు రితికా జైశ్వాల్ అనే ఓ డాక్టర్ గా పరిచయం చేయించారు .అక్కడ నుండి టర్కీకి తీసుకెళ్లి, కెంట్ ఇజ్మీర్ ఆస్పత్రిలో కిడ్ని ట్రాన్స్ ప్లాంట్ కు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలోనే అస్పత్రికి చెందిన డాక్టర్ అంబ్రిష్ రాజు కిడ్ని తీసీ గగన్ అగర్వాల్ కు అమర్చారు.

కిడ్ని దోచేసి బెదిరింపులు

కిడ్ని దోచేసి బెదిరింపులు

ఇక్కడి వరకు ఇద్దరి మధ్య అవగాహాన సాఫిగానే సాగినా, కిడ్ని ట్రాన్స్ ప్లాంట్ తర్వాత రాజుకు అసలు మోసం అర్ధమైంది. కిడ్ని మార్పిడి తర్వాత తనకు ఒప్పుకున్న డబ్బులు ఇవ్వాలని , రోహన్ ను అడిగాడు.దీంతో కుట్రకు ప్రాణం పోసిన రోహన్ రాజుకు డబ్బులు ఇవ్వకపోగా, డబ్బులు అడిగితే ఇక్కడే చంపివేస్తామని బెదిరించారు. దీంతో దేశంకాని దేశంలో చేసేదేమీలేక భయంతో తన ప్రాణాలైన కాపాడుకోవాలని రాజు భావించాడు. దీంతో కనీసం తనను ప్రాణాలతో ఇండియాకు పంపించాలని వేడుకున్నాడు. ఇక అంత సమసి పోయిందని భావించిన దుండగులు రాజు ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత ఇండియాకు పంపారు .

రాజకోండ పోలీసులకు పిర్యాదు చేసిన రాజు

రాజకోండ పోలీసులకు పిర్యాదు చేసిన రాజు

హైద్రబాద్ కు వచ్చిన తర్వాత రాజు ఫిబ్రవరి 5న రాచకొండ సీపీ మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజు ఇచ్చిన వాట్సప్ నెంబర్ ఆధారంగా కిడ్ని రాకెట్ కు చెందిన రోహన్ తోపాటు మరో వ్యక్తి రింకిలను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మధ్య ప్రదేశ్ కు చెందిన అమ్రిష్ ప్రతాప్ ఈ ముఠాకు సూత్రధారిగా గుర్తించారు.కాగా ఆ గ్యాంగ్ ఇలా నలబై కిడ్నిల వరకు శస్త్ర చికిత్స చేసి కిడ్నిలు మార్పిడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వారి మొత్తం రాకేట్ ను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
The Telangana police, busted an international kidney racket a couple of days ago, now widening the scope of the investigation to find out the nexus between doctors and three of the racketeers who were arrested, including the kingpin Amrish Pratap of Bhopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more