వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్‌ పై అవగాహనలో చదువు లేనోళ్ళే నయం ... తెలంగాణా పోలీసుల సర్వేలో వెల్లడైన నిజం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ .. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు . ఈ క్రమంలో నిత్య్వాసరా సరుకుల కోసం మినహాయించి బయటకు రాకూడదని ఆంక్షలు కూడా విధించింది. ఇక కేంద్రం నిర్ణయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ప్రజలు బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

కరోనా టైమ్.. విధుల్లో ఉన్న సిబ్బందికి జీతాలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా : తెలంగాణా సర్కార్కరోనా టైమ్.. విధుల్లో ఉన్న సిబ్బందికి జీతాలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా : తెలంగాణా సర్కార్

 లాక్ డౌన్ నిబంధనలను పాటించని విద్యావంతులు

లాక్ డౌన్ నిబంధనలను పాటించని విద్యావంతులు

ఇక తెలంగాణా రాష్ట్రం విషయానికి వస్తే లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కొంతమంది కాలు నిలవని ఆకతాయిలు ఏవో కుంటి సాకులు చెప్తూ రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. పోలీసులు ఆపుతున్నా వారు మాత్రం ఆగటం లేదు . అలాంటి వాళ్లను కంట్రోల్ చెయ్యటానికి పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. మరికొందరు పోలీసులైతే ఎంతో గౌరవంగా బయటకు రాకూడదని దణ్ణం పెట్టి మరీ బతిమలాడుతున్నారు. అయినాసరే మాట వినటం లేదు. ఇక ఇలా మాట వినకుండా కరోనాపై అవగాహన లేకుండా, లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వారు దాదాపు చదువుకున్న వాళ్ళే కావటం విశేషం .

చదువులేని వారికే లాక్ డౌన్ పై అవగాహన .. గ్రామాల్లో 80% లాక్ డౌన్

చదువులేని వారికే లాక్ డౌన్ పై అవగాహన .. గ్రామాల్లో 80% లాక్ డౌన్

ఇక ఈ విషయాన్ని తెలంగాణా పోలీసులు తాజాగా ఈ లాక్‌డౌన్‌పై జరిపిన సర్వే ద్వారా వెల్లడించారు . చదువుకున్న వారి కంటే చదువులేని వారే లాక్‌డౌన్ పట్ల అవగాహనతో ఉన్నట్లు సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు లాక్ డౌన్ ను 80% పాటిస్తున్నట్టు సర్వే లో వెల్లడైంది . నగరాలలో కేవలం 50% మాత్రమే లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తున్నారు. ఇక చదువు లేనోళ్ళు , రైతులు, వృద్ధులు 100 % లాక్ డౌన్ పాటిస్తున్నారు అని సర్వే రిపోర్టును తెలంగాణ పోలీస్ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 నిబంధనలు తుంగలో తొక్కేది నగరవాసులే .. అందులో విద్యార్థులైన యువత ఎక్కువ

నిబంధనలు తుంగలో తొక్కేది నగరవాసులే .. అందులో విద్యార్థులైన యువత ఎక్కువ

ఇక ఈ సర్వే రిపోర్ట్ ను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘మాకు అందిన సమాచారం ఆధారంగా, చేయబడ్డ చిన్న విశ్లేషణ., చిన్నబుచ్చుకోకుండా, పెద్దమనసు చేసుకుని, ఇంటి వద్దనే ఉండి, మీ బాధ్యత నిర్వర్తించండి'.. అంటూ కూడా తెలంగాణా పోలీసు శాఖ తమ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇక 62% ప్రజలు 15 రోజుల లాక్ డౌన్ కోరుతున్నారని , 27% ప్రజలు మూడు నెలల లాక్ డౌన్ అంటున్నారని , ఇక 5 % ప్రజలు 6 నెలలపాటు లాక్ డౌన్ కోరుతున్నారని, 6% ప్రజలు ఐడియా లేదు అని లాక్ డౌన్ గురింహి మాట్లాడటానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారని సర్వేలో వెల్లడించారు . ఇక చదువుకుంటున్న యువత ముఖ్యంగా 18 ఏళ్ళ నుండి 25 ఏళ్ళ మధ్య వయసున్న యువత మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ తమ సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

English summary
Telangana police recently conducted a survey on the lockdown. The survey found that those who were not educated were more aware of lockdown than those who were educated. The survey found that 80% of people in rural areas practice lockdown. Only 50% of cities follow lockdown regulations. Telangana Police posted on Twitter that the survey report that the laborers, farmers and the elderly are practicing 100% lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X