హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎన్నికలు: రాహుల్ పెద్ద తప్పు చేశారా? భారీ మూల్యం తప్పదా?, నేతల్లో కలవరం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, రాహుల్ గాంధీ తాజాగా తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అంసతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

పవన్ తండ్రిలాంటివారు! కాంగ్రెస్‌లోకి బండ్ల గణేష్: టీఆర్ఎస్‌కు షాకిచ్చిన భూపతిరెడ్డి పవన్ తండ్రిలాంటివారు! కాంగ్రెస్‌లోకి బండ్ల గణేష్: టీఆర్ఎస్‌కు షాకిచ్చిన భూపతిరెడ్డి

ఒక్క తెలంగాణ నేత కూడా లేడు

ఒక్క తెలంగాణ నేత కూడా లేడు

రాహుల్ గాంధీ ఆ నిర్ణయం తీసుకుని పెద్ద చేశారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అసలుకు ఆ నిర్ణయం ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థు ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీలో ఒక్క తెలంగాణ నేతకు కూడా చోటు కల్పించకపోవడం గమనార్హం.

ముగ్గురూ ఇతర రాష్ట్రాలకు చెందినవారే

ముగ్గురూ ఇతర రాష్ట్రాలకు చెందినవారే


ముగ్గురు సభ్యుల ఆ కమిటీ విషయానికొస్తే.. భక్త చరణ్ దాస్(ఏఐసీసీ సెక్రటరీ-ఒడిశా), 2. జోతిమని సెన్నిమలై (తమిళనాడుకు చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ సభ్యులు, రాహుల్ గాంధీ సన్నిహితులలో ఒకరు'), 3. షర్మిష్ట ముఖర్జీ(పశ్చిమబెంగాల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు) .

రాహుల్ పెద్ద తప్పు చేశారా?

రాహుల్ పెద్ద తప్పు చేశారా?

కమిటీలో నియమితులైన ముగ్గురు సభ్యులు కూడా తెలంగాణకు చెందిన వారు కాకపోవడంతో స్థానిక తెలంగాణ నేతలు రాహుల్ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఈ ముగ్గురికీ కూడా తెలంగాణ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో రాహుల్ గాంధీ వీరిని నియమించి పెద్ద తప్పు చేశారని భావిస్తున్నారు.

ఎలా గెలుస్తారు?

ఎలా గెలుస్తారు?


‘ఢిల్లీ నుంచి రావాల్సిన ఈ కమిటీలోని నేతలకు తెలంగాణ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేదు. ఇలాంటి వారు తెలంగాణలోని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు?' అని హైదరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇలాంటి నిర్ణయాలు సరికావని అన్నారు. సరైన అభ్యర్థిని ఎంపిక చేయకపోతే ఎన్నికల్లో ఎలా గెలుస్తామని ప్రశ్నించారు.

భారీ మూల్యం తప్పదు?

భారీ మూల్యం తప్పదు?

కాగా, తెలంగాణ రాజకీయాలపై మంచి పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి, వీరప్ప మొయిలీ లాంటి నేతలకు ఈ బాధ్యతలను అప్పగించివుంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని తెలంగాణకు ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస పొరపాటు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Looks like Telangana Congress leaders are disappointed with Rahul Gandhi, who today appointed a three-members screening committee to decide on the Party candidates for the upcoming Telangana State Assembly Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X