గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు: తెలంగాణ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్-2017
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకై తెలంగాణ పోస్టల్ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 19, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: తెలంగాణ పోస్టల్ సర్కిల్
పోస్టు: గ్రామీణ్ డాక్ సేవక్
ఖాళీలు: 127 జనరల్ - 65, ఓబీసీ - 30, పీహెచ్ -హెచ్‌హెచ్ - 3, పీహెచ్సీ - ఓహెచ్ - 2, ఎస్సీ - 18, ఎస్టీ - 9
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: డిసెంబర్ 19, 2017

పే స్కేల్: రూ.10000/ఒక నెలకు
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత. అదనపు అర్హతలను పరిగణనలోకి తీసుకోరు. సప్లిమెంటరీ కాకుండా మొదటి అటెంప్ట్‌లో పాసైనవారికి ప్రాధాన్యత.
వయో పరిమితి: నవంబర్ 20 నాటికి 18 - 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 60 రోజులపాటు కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై శిక్షణ తీసుకొన్న సర్టిఫికెట్ ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ లో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
దరఖాస్తు సమయంలో పదోతరగతి సర్టిఫికెట్, కంప్యూటర్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, పీహెచ్సీ సర్టిఫికెట్ (ఉన్నవారు), ఫొటో, సంతకాన్ని ఆన్లైన్లో జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
ఎంపిక విధానం: పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 20, 2017
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 19, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/Dn7V1Y
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!