ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌కు షాక్: నలమాస కృష్ణను అరెస్టు చేసిన ఎన్ఐఏ: ఖమ్మం నుంచి రాత్రికి రాత్రి

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్)కు ఊహించని విఘాతం. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మంలో నివసిస్తోన్న ఆయనను ఆదివారం రాత్రి తమ అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో నలమాస కృష్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్న తరువాత ప్రాథమిక చికిత్సల కోసం ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కొంత విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఇదివరకే ఓ సారి ఆయన అరెస్టు అయ్యారు. సుమారు ఎనిమిది నెలల పాటు జైలులో ఉన్నారు. కొద్దిరోజుల కిందటే విడుదల అయ్యారు. అదే కారణంతో ఈ సారి ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Telangana Praja Front Vice President Nalamasa Krishna has been arrested from Khammam

మావోయిస్టు ఆగ్రనేతలు, ఏఓబీ, ఛత్తీస్‌గఢ్‌లల్లో క్రియాశీలకంగా ఉంటోన్న టాప్ క్యాడర్‌తో నలమాస కృష్ణకు సంబంధాలు ఉన్నాయనడానికి ఎన్ఐఏ అధికారుల వద్ద కీలక ఆధారాలు లభించాయని తెలుస్తోంది. మావోయిస్టుల ఆనుపానులు తెలిసిన వ్యక్తి కావడం వల్ల వారికి సంబంధించిన కదలికలు, పూర్తి సమాచారాన్ని సేకరించడానికి కృష్ణను తమ అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు బండారి మద్దిలేటిని గత ఏడాది అక్టోబర్ 8న అరెస్టు చేశారు. మద్దిలేటిని విచారించిన సందర్భంగా నలమాస కృష్ణ పేరు వినిపించిందని సమాచారం. నలమాస కృష్ణకు మావోయిస్టు అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదలాయించారని అంటున్నారు. 14 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నామని వివరిస్తూ ఎన్‌ఐఏ అధికారులు నలమాస కృష్ణ కుటుంబ సభ్యులకు వారెంట్‌ కాపీని ఇచ్చారు.

Recommended Video

Family Recovered From Corona Without Going To Hospital

అరెస్టు చేయడానికి ముందు కూడా తమకు సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నలమాస కృష్ణకు ఇదివరకు మావోయిస్టులతో అతి సన్నిహితంగా మెలిగిన సందర్భాలు ఉన్నాయని, అనంతరం ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయారని అంటున్నారు. ఆ తరువాత కూడా మావోయిస్టులతో సంబంధాలను యధాతథంగా కొనసాగిస్తున్నారని సమాచారం. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఇదివరకు ఆయన అరెస్టు అయినప్పటికీ.. అదే కారణంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకోవడం తొలిసారి అని అంటున్నారు.

English summary
The National Investigation Agency (NIA) on Sunday arrested the vice president of the Telangana Praja Front for allegedly aiding illegal activities of the CPI (Maoist) in the garb of organising agitations for people''s cause, an official said. ​Nalamasa Krishna, 41, was arrested from Khammam district of Telangana, the official of the premier investigation agency said. The case was originally registered on October 8 last year in Hyderabad based on the seizure of incriminating documents and material from the residence of Maddileti alias Bandari Maddileti, the president of the Telangana Vidyarthi Vedika (TVV).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X