వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దెకు తెలంగాణ జైళ్ళు: ఒక్కో ఖైదీకీ రూ.10వేలు

తెలంగాణ జైళ్ళ శాఖ వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఒకరోజుకు సంగారెడ్డి జైల్లో రూ.500 చెల్లిస్తే గడిపే అవకాశం కల్పించింది. అయితే ఇతర రాష్ట్రాలు కోరుకొంటే తమ రాష్ట్రంలోని జైళ్ళను అద్దెకు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జైళ్ళ శాఖ వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఒకరోజుకు సంగారెడ్డి జైల్లో రూ.500 చెల్లిస్తే గడిపే అవకాశం కల్పించింది. అయితే ఇతర రాష్ట్రాలు కోరుకొంటే తమ రాష్ట్రంలోని జైళ్ళను అద్దెకు ఇవ్వనున్నట్టు జైళ్ళ శాఖ ప్రకటించింది.

నార్వే తరహలోనే తెలంగాణలో కూడ జైళ్ళు అద్దెకు ఇవ్వనున్నట్టు జైళ్ళ శాఖ డీజీపీ వీకే సింగ్ ప్రకటించారు. బీహర్, ఉత్తర్ ప్రదేశ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖైదీలకు జైళ్ళు సరిపోవడం లేదు.

Telangana prisons for rent: Dgp Vk Singh

ఇతర రాష్ట్రాలకు చెందిన ఖైదీలకు తెలంగాణ జైళ్ళలో ఆశ్రయం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఒక్కో ఖైదీకి నెలకు రూ.10 వేలను అద్దెను వసూలు చేస్తామని ఆయన చెప్పారు.

దీని ద్వారా జైళ్ళశాఖకు ప్రతి ఏటా 25 కోట్లు ఆదాయం రానుందని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే ఇప్పటికే మెదక్ జిల్లాలోని సంగారెడ్డి జైలు పర్యాటక ప్రదేశంగా మారింది.

ఈ జైలులో ఒక్కరోజు గడపాలంటే రూ.500 చెల్లించాల్సింది. ఇదే తరహలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఖైదీలకు జైళ్ళను అద్దెకు ఇవ్వనుంది జైళ్ళ శాఖ.

English summary
Telangana prisons department Dgp Vk singh announced rent for prisons in the state. if any state prisons department want to use prisons in the telangana, spend ten thousand rupee for each one candidate he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X