వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమతులతోనే తెలంగాణా ప్రాజెక్ట్ లు .. ఏపీ గిల్లికజ్జాలకు దిగడం సరికాదు : స్పీకర్ పోచారం

|
Google Oneindia TeluguNews

తెలంగాణా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కృష్ణానదీ జలాల కేటాయింపుపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న పంచాయితీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి నిర్వహించిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాజెక్టుల విషయంలో అనవసరంగా గిల్లికజ్జాలకు దిగుతోందని పేర్కొన్నారు.

Recommended Video

Krishna Water Dispute B/W AP&TS తెలుగురాష్ట్రాల కృష్ణా జలాల పంచాయితీ .. తేల్చాల్సింది కేంద్రమే !!
 ఏపీ అనవసర తగాదాలకు దిగొద్దని హితవు

ఏపీ అనవసర తగాదాలకు దిగొద్దని హితవు


కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను, నీటి కేటాయింపు అనుమతులను తీసుకొని నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అని పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా బేసిన్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్క రాష్ట్రాల వాళ్లు అనవసర తగాదాలకు దిగొద్దని హితవు పలికారు. కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నీటి పంపకం విషయంలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉంది అనేది కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు కూడా ఉన్నాయని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 ప్రజలకు న్యాయం జరగాలంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి

ప్రజలకు న్యాయం జరగాలంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి

ప్రజలకు న్యాయం జరగాలంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని, సహృదయంతో ప్రవర్తించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతిదానికి గిల్లికజ్జాలు దిగడం మంచి సంప్రదాయం కాదని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు . ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నదమ్ముల్లా విడిపోదాం ఆత్మీయంగా కలిసుందామని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించడం కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి చిన్న విషయానికి రాజకీయం చేయడానికి ఇది సరైన సమయం కాదని, ఇవి వేదికలు కాదని పేర్కొన్నారు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణా నీటి యుద్ధం

కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణా నీటి యుద్ధం

మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందుతుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ఒకపక్క కృష్ణానది యాజమాన్య బోర్డు వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది వినియోగించుకోని నీటిని ఈ సంవత్సరం వినియోగించుకుంటే మంటూ తెలంగాణ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ ప్రతిపాదనను ఏపీ తోసిపుచ్చింది. ఏ ఏడాది నీటిని ఆ ఏడాది మాత్రమే వినియోగించుకోవాలని, గత సంవత్సరం వినియోగించుకోని నీటిని కూడా క్యారీ ఓవర్ గా పరిగణించాలని పేర్కొంది.

పోచారం వ్యాఖ్యలతో తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి

పోచారం వ్యాఖ్యలతో తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి

ఇదే సమయంలో కృష్ణా బేసిన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుందని కయ్యానికి కాలు దువ్వుతుంది. మరోపక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం పై రెండు తెలుగు రాష్ట్రాలు తగ్గకుండా పోరాటం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

English summary
Telangana Speaker Pocharam Srinivas Reddy made interesting remarks on the ongoing water war between AP and Telangana .Telangana Speaker Pocharam Srinivas Reddy, said that the state of Andhra Pradesh was unnecessarily squabbling over projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X