వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: 13 ప్రభుత్వాసుపత్రుల్లో 5100 పడకలు, మెడికల్ కాలేజీ, ఆస్పత్రులు కూడా...?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అందుకు తగిన ఆస్పత్రులు, అందులో సదుపాయాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో 13 ప్రభుత్వాసుపత్రుల్లోని 5 వేల 100 పడకలను ఐసోలేషన్ వార్డులుగా మార్చామని ప్రకటించింది.

డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు: కరోనా పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోడీడొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు: కరోనా పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ

ఆయుర్వేదిక్ జనరల్ హాస్పిటల్, ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, రామంతాపూర్‌లో గల ప్రభుత్వ హోమియోపతి హాస్పిటల్, అమీర్‌పేటలోని నాచురో క్యుర్ ఆస్పత్రి, మసాబ్ ట్యాంక్‌లో గల సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, చార్మినార్‌లోని నిజామియా యునానీ ఆస్పత్రి, ఎస్ఆర్ నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స ఇస్తారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రి, వరంగల్‌లో ఎంజీఎం ఆస్పత్రుల్లో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నారు.

Telangana readies 13 government hospitals and 5100 beds..

గాంధీ ఆస్పత్రిలోనే 500 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. గచ్చిబౌలిలో కోవిడ్ 19 ఆస్పత్రి వారం రోజుల్లో అందుబాటులోకి వస్తోంది. ఇక్కడ 1500 పడకలు ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే 4 వే 80 పడకలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరో 1010 పడకలు కొద్దిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు మిగతా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.

English summary
Telangana readies 13 government hospitals and 5100 beds officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X