హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీవీకి భారతరత్న, ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మవిభూషణ్: తెలంగాణ సర్కార్ సిఫారసు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. వచ్చే ఏడాది జనవరి 26న ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించి ప్రతిపాదిత జాబితాను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

43 మంది పేర్లతో కూడిన జాబితాను వారం కిత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదించింది. ఈ జాబితాలోని పేర్లను పద్మ అవార్డులకు పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

ఈ జాబితాలో పద్మవిభూషణ్‌ కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్ శివ్ కే కుమార్‌, విద్యావేత్త రాంరెడ్డి పేర్లను ప్రతిపాదించించారు. పద్మశ్రీ కోసం విద్యా వేత్త చుక్కారామయ్య తదితర పేర్లతో కూడిన జాబితాను పంపించారు. గడిచిన ఏడాది ఈ అవార్డుల కోసం 26 మంది పేర్ల జాబితాను సమర్పించిన సంగతి తెలిసిందే.

Telangana recommends Bharat Ratna to P.V. Narasimha Rao

భారత్‌లో భూసంస్కరణలకు ఆద్యుడు, ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని నూతన పథంలో నడిపించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి, మలి ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన విద్యావేత్త, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అనేక ఉద్యమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు.

పద్మ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ప్రముఖులలో సినిమా డైరెక్టర్ బీ నర్సింగ్‌రావు(ఫిల్మ్ మేకింగ్), కాపు రాజయ్య(పెయింటింగ్-మరణానంతరం), కే లకా్ష్మగౌడ్(పెయిటింగ్), తోట వైకుంఠం(పెయిటింగ్), కళాకృష్ణ (డ్యాన్సర్), దీపికారెడ్డి(కూచిపూడి డ్యాన్సర్), డాక్టర్ పీ అలేఖ్య(కూచిపూడి), డాక్టర్ చుక్క సత్తయ్య(జానపద కళాకారుడు), గడ్డం సమ్మయ్య(జానపద గాయకుడు), గోరటి వెంకన్న(జానపద గాయకుడు), అందెశ్రీ(కవి,గాయకుడు) ఉన్నారు.

వీరితో పాటు సుద్దాల అశోక్‌తేజ(సినీగాయకుడు), ఎక్కా యాదగిరిరావు(శిల్పి), గుత్తా మధుసూదన్‌రెడ్డి(బోన్సాయ్ ఆర్టిస్ట్), సయ్యద్ మజీర్ హుస్సేన్(సోషల్ వర్కర్), డాక్టర్ ధర్మపురి విద్యాసాగర్(పిల్లల వైద్యుడు), డాక్టర్ ఎన్ గోపి(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), అంపశయ్య నవీన్ (లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), చుక్కా రామయ్య(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), జమ్మలమడక పిచ్చయ్య(బ్యాడ్మింటన్ క్రీడాకారుడు) ఉన్నారు.

ప్రొఫెసర్ పాండురంగారావు మండేలా(ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్), జీ పద్మజారెడ్డి(కూచిపూడి), ఎస్ విఠల్‌రావు(గజల్-మరణానంతరం), చిందుల శ్యామ్(జానపద కళాకారుడు), సింగిరెడ్డి బాల త్రిష(సోషల్ వర్కర్), చింతలగిరి మోహన్‌రావు( సైన్స్ అండ్ ఇంజినీరింగ్), బీవీఆర్ మోహన్‌రెడ్డి(ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ), ప్రొఫెసర్ కే సత్యనారాయణ(యోగా, నాచురోపతి), ప్రొఫెసర్ శివ్ కే కుమార్(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్- పద్మభూషణ్), డాక్టర్ జైశెట్టి రమణయ్య(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్) ఉన్నారు.

ముదిగొండ వీరభద్రయ్య(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), వడ్డెపల్లి కృష్ణ(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), రావిరాల జయసింహ(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), మాలావత్ పూర్ణ, ఆనంద్‌కుమార్(క్రీడలు, పర్వతారోహణ), గుత్తా జ్వాల(బ్యాడ్మింటన్), డాక్టర్ జయప్రద రామమూర్తి(ప్లూట్‌వాయిద్యం), సామల వేణు(మ్యాజిక్), దుగ్గిరాల సోమేశ్వరరావు(నటుడు, దర్శకుడు), పసుపులేటి హన్మంతరావు(సోషల్ వర్కర్), డాక్టర్ పీసీ రథ్(మెడిసిన్), మామిడాల రాములు(లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), రవ్వా శ్రీహరి( లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), యెండల సౌందర్య(హాకీ) ఉన్నారు.

English summary
Telangana state government has sought Bharat Ratna, the country’s highest civilian award, to former prime minister late P.V. Narasimha Rao for his immense contribution to the economic development of the country through his reforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X