వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధిరేటులో దేశంలో తెలంగాణే నెం.1: కాగ్ రిపోర్ట్, కేసీఆర్ హర్షం, టాప్-5 రాష్ట్రాలు ఇవే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత నాలుగేళ్లలో రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు దేశంలోనే తొలిస్థానంలో ఉందని కాగ్‌(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) చేసిన ప్రకటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. 2014 జూన్‌ నుంచి 2018 మే వరకు దేశంలోని ఆయా రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్లను కాగ్‌ వెల్లడించింది.

కాగ్ నివేదిక

కాగ్ నివేదిక

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కాగ్‌ వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకు సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏడాది నమోదైన ఆదాయ వృద్ధిని వెబ్‌సైట్‌లో కాగ్‌ పొందుపరిచింది. దీని ప్రకారం 2014 జూన్‌ నుంచి 2018 మే వరకు ఆయా రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్లను ప్రకటించారు.

Recommended Video

కేసీఆర్ సవాల్ కు ఉత్తమ్ సై
తెలంగాణ నెం.1.. టాప్-5రాష్ట్రాలివే

తెలంగాణ నెం.1.. టాప్-5రాష్ట్రాలివే

గత నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం17.2 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్టు కాగ్‌ ప్రకటించింది. 14.2 శాతంతో హర్యానా రెండో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర మూడు, ఒడిశా నాలుగో స్థానంలో, పశ్చిమబెంగాల్ ఐదో స్థానంలో నిలిచినట్టు వివరించింది. ఈ ఐదు రాష్ట్రాలు మాత్రమే 10 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేశాయని పేర్కొంది.

ముందంజలో తెలంగాణ

ముందంజలో తెలంగాణ

దేశంలోని మిగతా రాష్ట్రాల్లో వృద్ధిరేటు తక్కువగా నమోదైనట్టు కాగ్‌ తెలిపింది. తెలంగాణలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వృద్ధిరేటు సాధించగా.. 2016-17లో 21.1 వృద్ధిరేటు నమోదైంది. 2017-18లో 16.8శాతం వృద్ధిరేటు లభించింది. ఈ నాలుగేళ్లలో సగటున 17.2 వృద్ధిరేటుతో రాష్ట్రం ముందంజలో నిలిచిందని వెల్లడించింది.

కేసీఆర్ ఏమన్నారంటే..

కేసీఆర్ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 17.2 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ ఆదాయం అగ్రగామిగా ఉంటే మిగతా రాష్ట్రాల ఆదాయం వృద్ధిరేటు 10శాతం లోపే ఉన్నాయన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నోట్ల రద్దు , జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా స్థిరమైన వృద్ధి సాధించామని చెప్పారు. ఆదాయ వృద్ధితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేయవచ్చని అన్నారు.

English summary
In the official website of Comptroller and Auditor General(CAG), it has been mentioned that during the preceding four financial years the average growth rate in the state own tax revenues, Telangana has registered the highest groth reate when compared to all other states in India and stood first among all the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X