వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం అమ్మకాల్లో తెలుగు రాష్ట్రాల పోటీ: బ్రాందీ విస్కీల్లో ఏపీ...బీర్ల సేల్స్‌లో తెలంగాణ టాప్

|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: ఓ వైపు ఎండ మరోవైపు దాహం.. దాహం అయితే ఎవరైనా మంచినీళ్లు తాగి దాహార్తిని తీర్చుకుంటారు కానీ తెలంగాణలో మాత్రం బీర్లతో దప్పికను తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం ఈ వేసవిలో అత్యధికంగా బీర్లు కేసులు అమ్ముడుపోవడమే. ఇది స్వయంగా ప్రభుత్వం చెబుతున్న లెక్కలే కావడం విశేషం.

కూల్ కేకుల్లా అమ్ముడుపోయిన కూల్ బీర్లు

కూల్ కేకుల్లా అమ్ముడుపోయిన కూల్ బీర్లు

ఏప్రిల్ మే నెలలో తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఒకే సారి ఉష్ణోగ్రతలు ఏకంగా 42 డిగ్రీల సెల్సియస్ తాకడంతో ఎండవేడిమికి అల్లాడిపోయారు ప్రజలు. సామాన్య ప్రజల సంగతి అటుంచితే... మద్యం ప్రియులు మాత్రం కేవలం బీర్లు తాగే కడుపులు నింపుకున్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర బెవెరేజెస్ కార్పోరేషన్ వెల్లడిస్తున్న లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఒక్క మే నెలలోనే 61 లక్షలు కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఏప్రిల్‌లో ఈ సంఖ్య 53 లక్షల కేసులుగా ఉన్నింది.ఇక ప్రభుత్వం నేతృత్వంలో నడుస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్ సంస్థ 57 లక్షల బీర్లు కేసులు అమ్మిందంటే బీర్లకు ఎంత డిమాండ్ ఉన్నిందో ఇట్టే అర్థమవుతోంది.

నీటి కొరత ఉన్నప్పటికీ తగ్గని బీర్ల ఉత్పత్తి

నీటి కొరత ఉన్నప్పటికీ తగ్గని బీర్ల ఉత్పత్తి

నీటికొరత ఉన్నప్పటికీ మద్యం ఉత్పత్తి ఎక్కడా మరీ తగ్గినట్లు దాఖలాలు కనిపించలేదు.మెదక్‌లో నీటికొరతతో బీర్ల ఉత్పత్తి కాస్త తగ్గుముఖం పట్టింది. నీటికొరత ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు బీర్ల ఉత్పత్తి సంస్థలకు నీటి సరఫరాను నియంత్రించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నీటికొరతతో వైన్ షాపులకు బీర్లు సరఫరా 30శాతం తగ్గిందని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. కాస్లీ బీర్లు సప్లై బాగానే ఉన్నప్పటికీ... సగటు వ్యక్తి తాగే కామన్ బ్రాండ్ బీర్ మాత్రం సప్లైతో తగ్గుదల కనిపించిందని వెల్లడించింది.

ఎన్నికల సీజన్‌లో బీర్లకు మరింత డిమాండ్

ఎన్నికల సీజన్‌లో బీర్లకు మరింత డిమాండ్

వేసవికాలంటో దేశవ్యాప్తంగా బీర్ల సరఫరా తగ్గిందని చెప్పిన తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్...తెలంగాణలో మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల బీర్ల సరఫరా కాస్త తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది. అంటే ఎంత సరఫరా చేసిన అధిక డిమాండ్ ఉండటం వల్ల ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోయేదని వివరించింది. అంతేకాదు ఎన్నికల సీజన్ కూడా కావడంతో బీర్లకు డిమాండ్ మరింత పెరిగినట్లుతెలుస్తోంది. ఏపీలో విస్కీ, బ్రాందీ సేల్స్ టాప్‌లో ఉండగా తెలంగాణలో మాత్రం బీర్ల సేల్స్ టాప్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Beer sales have seen a record high in Telangana as consumers sought to take respite from soaring temperatures in many parts of the state. In the absence of the timely south west monsoon, temperatures were hovering over 40 degree celsius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X