వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా: భారీగా టెస్టులు - తగ్గిన కొత్త కేసులు - ఇవాళ 1436 - గ్రేటర్‌లో మాత్రం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో భారీ ఎత్తున టెస్టులు జరుపుతున్నప్పటికీ కొత్త కేసులు స్వల్పంగా బయటపడుతుండటంతో కరోనా ఉధృతి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 41,043 శాంపిళ్లను పరీక్షించగా, కేవలం 1436 మంది మాత్రమే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,22,111 కు చేరింది.

అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?

అదుపులోకి మరణాలు..

అదుపులోకి మరణాలు..

కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతోపాటు డిశ్చార్జిలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో మరణాలు దాదాపుగా అదుపులోకి వచ్చాయి. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఆరుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్య 1,271కు పెరిగింది. తాజాగా 2,154 మంది డిశ్చార్జ్‌ కాగా.. కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,98,790 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,050గా ఉంది.

జిల్లాల వారీగా ఇలా..

జిల్లాల వారీగా ఇలా..

గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 249 కొత్త కేసులు వచ్చాయి. ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 77, జగిత్యాల్‌ 27, జనగాం 21, జయశంకర్ భూపాలపల్లి 18, జోగులమ్మ గద్వాల్‌ 11, కామారెడ్డి 34, కరీంనగర్‌ 76, ఖమ్మం 78, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 30, మహబూబాబాద్‌ 30, మంచిర్యాల్‌ 23, మెదక్‌ 20, మేడ్చల్ మల్కాజ్‌గిరి 105, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 24, నల్గొండ 75, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 21, నిజామాబాద్‌ 30, పెద్దంపల్లి 20, రాజన్న సిరిసిల్ల 27, రంగారెడ్డి 110, సంగారెడ్డి 34, సిద్ధిపేట్‌ 67, సూర్యాపేట 28, వికారాబాద్‌ 25, వనపర్తి 21, వరంగల్‌ రూరల్‌ 24, వరంగల్‌ అర్బన్‌ 59, యాద్రాది భువనగిరి 20 కేసులు నమోదయ్యాయి.

కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?

గ్రేటర్ పరిధిలో ఇబ్బందులు..

గ్రేటర్ పరిధిలో ఇబ్బందులు..

కరోనా కేసులు, మరణాలకు సంబంధించి హైదరాబాద్ నగరం తొలి నుంచీ ప్రమాదకరంగా ఉండగా, కొద్ది వారాల నుంచి పరిస్థితిలు అదుపులోకి వచ్చాయి. అయితే, గురు, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కరోనా టెస్టులు, చికిత్సలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈక్రమంలో జనం గుంపులుగా చేరడంతో కరోనా వ్యాప్తిపై భయాందోళనలు నెలకొన్నాయి.

English summary
Telangana state reported 1436 new COVID-19 cases during the past 24 hours. With this, the total COVID cases in the state went up to 2 lakh 22 thousand 111. The state conducted over 41 thousand tests yesterday. The recovery rate has also marginally improved to 89.5 per cent with 2154 more people recovering yesterday. This took the number of recovered people so far in the state to 1 lakh 98 thousand 790.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X