వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో జగన్ కన్నా పవన్ బెటర్ ..! తెలంగాణ ఆర్టీసి కార్మికుల ప్రశంసలందుకున్నగబ్బర్ సింగ్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసి ఉద్యోగలోకంతో పాటు సామాన్య ప్రజానీకం జనసేన అధినేత పవన్ కళ్యాన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె ఉదృత రూపం దాలుస్తున్న తరుణంలో పలు ప్రజా సంఘాల సంఘీభావం ప్రకటిస్తున్నాయి. అంతే కాకుండా రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకుంఉన్నాయి. ఇక తెలంగాణ హైకోర్ట్ కూడా ఆర్టీసి కార్మికుల సమ్మె అంశంలో ప్రభుత్వాన్ని మొండి పట్టుదలకు వెళ్లొద్దనే సూచనలు చేసింది. సరిగ్గా ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులు ఇచ్చిన బంద్ కు సంఘీభావం ప్రకటించారు.

 తెలంగాణ సమస్యల పట్ల పవన్ స్పందన.. శబ్బాష్ అంటున్న ప్రజలు..

తెలంగాణ సమస్యల పట్ల పవన్ స్పందన.. శబ్బాష్ అంటున్న ప్రజలు..

అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసారు. కాని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇంత వరకూ ఎందుకు తెలంగాణ సమ్మె పట్ల స్పందించలేదనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజా సమస్యలపై స్పందింస్తున్న పవన్ కళ్యాన్ తీరు పట్ల పలువురు సానుకూలంగా స్పందించడం విశేషం. ఇదే విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పై కార్మిక లోకం కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

 ఆర్టీసి బంద్ కు జనసేన మద్దత్తు.. ప్రశంసిస్తున్న ఉద్యోగ సంఘాలు..

ఆర్టీసి బంద్ కు జనసేన మద్దత్తు.. ప్రశంసిస్తున్న ఉద్యోగ సంఘాలు..

తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికులు. ప‌లు డిమాండ్ల‌ను పేర్కొంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మె 15వ రోజుకు చేరడంతో పాటుగా, నేడు రాష్ట్ర బంద్‌కు సైతం పిలుపునిచ్చింది. అధికార టీఆర్ఎస్‌ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన సహా అన్ని పార్టీలు బంద్ లో పాల్గొంటామని ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఓలా, ఉబర్ క్యాబ్‌లతోపాటు ప్రైవేట్ టాక్సీలు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ టాక్సీ డ్రైవర్ల జేఏసీ తెలిపింది. లెక్చరర్స్‌ జేఏసీ, జానపదకళాకారుల సంఘం కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి.

 కేసీఆర్ కు సవాల్ గా మారుతున్న జగన్ నిర్ణయాలు..ఆర్టీసి విలీనం పట్ల టీ సర్కార్ ను నిలదీస్తున్న కార్మికులు..

కేసీఆర్ కు సవాల్ గా మారుతున్న జగన్ నిర్ణయాలు..ఆర్టీసి విలీనం పట్ల టీ సర్కార్ ను నిలదీస్తున్న కార్మికులు..

అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావుతో స‌న్నిహిత సంబంధాలున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు ఎలా ఉన్నా, ఆర్టీసి అంశంలో తీసుకున్న నిర్ణయం తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికుల‌ను ఆక‌ట్టుకొని, అదే డిమాండ్ ను తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ససేమిరా అనడంతతో స‌మ్మె పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..! ఇలాంటి స‌మ‌యంలో రాజ‌కీయాల నేపథ్యంలో వైసీపీ పార్టీ స‌మ్మెకు బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేక‌పోయింది. కనీసం కార్మికుల డిమాండ్ల‌ను సానుకూలంగా ప‌రిశీలించాల‌ని కూడా జ‌గ‌న్ సూచించ‌లేద‌ని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు.

 ఆర్టీసి కార్మికుల సమ్మె పట్ల పెదవి విప్పని జగన్.. చురుగ్గా అడుగులు వేస్తున్న పవన్..

ఆర్టీసి కార్మికుల సమ్మె పట్ల పెదవి విప్పని జగన్.. చురుగ్గా అడుగులు వేస్తున్న పవన్..

మ‌రోవైపు, తెలంగాణ‌లో త‌క్కువ ఆద‌ర‌ణ ఉన్న జ‌న‌సేన పార్టీ త‌న స్టాండ్‌ను స్ప‌ష్టంగా తెలియ‌జేసింద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో ప‌వ‌న్ త‌న‌ వైఖ‌రి వెల్ల‌డిస్తూ, తాను కార్మికుల ప‌క్ష‌మేన‌ని, వారిని రోడ్డున ప‌డేసే నిర్ణ‌యానికి మ‌ద్ద‌తిచ్చేది లేద‌ని తెల్చిచెప్పడాన్ని వారు హ‌ర్షిస్తున్నారు. తెలంగాణ లో యురేనియం సమస్య గురించి స్పందించి గిరిజనుల హక్కులకు అనుకూలంగా మాట్లాడిన పవన్ వైఖరిని తెలంగాణ ప్రజలు ప్రశంసించారు. తాజాగా ఆర్టీసి సమ్మె, కార్మికుల బంద్ పిలుపు సందర్బంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు ప్రశంసించేదిగా ఉందని అటు కార్మిక లోకం, ఇటు తెలంగాణ ప్రజానికం గబ్బర్ సింగ్ ను పొగడ్తలతో ముంచెత్తుతోంది.

English summary
Jagan Mohan Reddy, who is at the chief Minister level,has not responded on the RTC strike. While there are no positions in politics, many have responded positively to the way of Pawan Kalyan is responding RTC and public issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X