వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దామోదర్ రెడ్డికి అస్వస్థత, తలకు గాయం: ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

|
Google Oneindia TeluguNews

సూర్యాపేట: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెలకొన్న వివాద విషయమై ధర్నాకు దిగిన సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

స్థానిక పబ్లిక్‌ క్లబ్‌లోని సభ్యులు కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పక్షాలుగా విడిపోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల టీఆర్ఎస్ వర్గీయులతో అపెక్స్‌ కమిటీ ఏర్పాటుచేశారు. కాంగ్రెస్‌కు చెందిన క్లబ్‌ మాజీ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి వర్గీయులు ర్యాలీగా వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

Telangana: Ruckus at Independence Day fete spoils mood

విషయం తెలుకున్న దామోదర్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి స్థానిక గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వీరికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మద్దతు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసే క్రమంలో వాగ్వాదం నెలకొని దామోదర్‌రెడ్డి కింద పడిపోవడంతో తలకు స్వల్ప గాయాలయ్యాయి.

దీంతో సొమ్మసిల్లి పడిపోయిన దామోదర్‌రెడ్డిని, పద్మావతిని సూర్యాపేట ప్రాంతీయాసుపత్రిలో చేర్పించారు. దామోదర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. ఆయనను పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. భారీగా కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

English summary
Tension prevailed at Gandhi Chowk in Suryapet for some time on Tuesday after the police detained Congress leader and former minister Ramreddy Damodar Reddy and Kodad MLA Padmavathi Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X