హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదే మా కోరిక: 15వ పుట్టిన రోజు జరుపుకున్న వీణా-వాణీ

అవిభక్త కవలలుగా జన్మించిన వీణావాణీలు సోమవారంనాడు 15వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. కాగా, వారి తల్లిదండ్రులు ఆదివారం రోజునే హైదరాబాద్‌లోని స్టేట్‌ చైల్డ్‌హోంకు వెళ్లారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అవిభక్త కవలలుగా జన్మించిన వీణావాణీలు సోమవారంనాడు 15వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. కాగా, వారి తల్లిదండ్రులు ఆదివారం రోజునే హైదరాబాద్‌లోని స్టేట్‌ చైల్డ్‌హోంకు వెళ్లారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన మారగాని మురళి, నాగలక్ష్మిలకు ఈ అవిభక్త కవలలు 16 అక్టోబర్‌ 2006న జన్మించారు.

అంతులేని వ్యథ: వీణా వాణీలపై చేతులెత్తేసిన ఎయిమ్స్, తల్లిదండ్రుల వేడుకోలుఅంతులేని వ్యథ: వీణా వాణీలపై చేతులెత్తేసిన ఎయిమ్స్, తల్లిదండ్రుల వేడుకోలు

అయితే, వీరిని విడదీసేందుకు గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు నాయుడమ్మ.. వారి తలపై ఉన్న పలుచటి పొరలను తొలగించారు. కానీ, వారిని విడదీయరాదని భావించిన నాయుడమ్మ.. తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.

Telangana's Conjoined Twins Veena - Vani Celebrates 15th Birthday

ఆ తర్వాత హైద్రాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రి వర్గాలు వీణావాణీలకు శస్త్ర చికిత్స చేస్తామని ముందుకు వచ్చాయి. తమ పిల్లలను విడదీస్తారని కోటి ఆశలతో ఎదురు చూసిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. 2008లో ముంబైలోని బ్రీంచ్‌కాండి ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేస్తామంటూ నిలోఫర్‌ ఆస్పత్రిలో ఉన్న వీణా వాణిలను పరిశీలించారు.

అక్కడ నుంచి వైద్యులు డాక్టర్‌ కేత్‌గో నేతృత్వంలో బ్రీంచ్‌కాండికి తరలించారు. రెండు నెలల పాటు సాధ్యాసాధ్యాలపై పలు పరీక్షలు చేయడంతో విడదీయలేమంటూ తిరిగి నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అనంతరం సింగపూర్‌ వైద్యబృందం సైతం అవిభక్త కవలల శస్త్రచికిత్సపై పరిశోధనలు చేశారు. అయితే, వైద్యులెవరూ కూడా వీణా-వాణీలను విడదీసేందుకు ముందుకు రాలేదు. దీంతో గత 15ఏళ్లుగా వీణా-వాణీల కష్టాలు వారితోపాటే కొనసాగుతూనే ఉన్నాయి.

కేసీఆర్‌ను కలవాలేనేదే మా కోరిక: వీణా వాణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ఉందని వీణా-వాణీ తెలిపారు. భవిష్యత్తులో ఇంజినీర్‌, సైంటిస్ట్‌ కావాలనుకుంటున్నట్టు వారు వెల్లడించారు. ప్రస్తుతం స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న వీరి బాగోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటున్న విషయం తెలిసిందే.

కాగా, ఆపరేషన్‌ చేసి వీణా-వాణీలను విడదీయాలని ప్రభుత్వానికి తండ్రి మురళి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది తన పిల్లలిద్దరూ విడివిడిగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

పుట్టినప్పటి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలోనే ఎక్కువ కాలం గడిపిన ఈ చిన్నారులను తర్వాత స్టేట్‌హోంకు తరలించారు. గత సంవత్సరం ఐదో తరగతి చదివిన వీణా-వాణీలకు ఐక్యూ బాగుండటంతో ఈ ఏడాది ఏడో తరగతికి ప్రమోట్‌ చేశారు

English summary
Telangana's Conjoined Twins Veena - Vani Celebrated 15th Birthday on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X