• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొదలైన బతుకమ్మ సంబరాలు: ఆడిపాడిన కవిత, పద్మ, విమలక్క(పిక్చర్స్)

|

హైదరాబాద్: తెలంగాణాలోని పది జిల్లాల్లో సోమవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో మహిళలు ఉత్సాహవంతంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండవ సంవత్సరం చేసుకునే ఉత్సవాలను సాంస్కృతిక శాఖ ఎంతో వైభవంగా నిర్వహించాలని సంకల్పించి రవీంద్ర ప్రాంగణాన్ని రంగురంగుల దీపాలతో సుందర మనోహరంగా అలంకరించారు. ఉత్సవాలలో మహిళలు ఒక్కొక్కరు ఒక్కొక్క బతుకమ్మను రూపొందించి, ఆ బతుకమ్మను ముస్తాబుచేసి పూజించారు.

కాగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తొలిరోజు బంగారు బతుకమ్మతో బంతిపూల వనంలా మారింది. ఈ ఉత్సవాల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడే అంగడి మైదానం బంతి పూల వనంలా జనంతో నిండిపోయింది. తీరొ క్క పూలు, విద్యుత్ దీపాల కాంతు లు, కళాకారుల విన్యాసాలు, ప్రదర్శనలు, మహిళల బతుకమ్మ ఆటాపాటలతో అంగడి మైదానం కోలాహలంగా మారింది.

తొలుత పట్టణంలోని నెక్కొండ రోడ్ రెడ్డి కళ్యాణ మండపం నుండి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది బతుకమ్మలు ఎత్తుకుని బతుకమ్మ వేడుక జరిగే అంగడి మైదానానికి భారీ ప్రదర్శనగా బయలుదేరారు. అనంతరం అంగడి మైదానంలో మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆట, పాట ఆడారు.

సాయంత్రం ఆరు గంటలకే పట్టణంలోని ద్వారకపేట, శాంతినగర్, వల్లబ్‌నగర్, సర్వాపురం ప్రాంతాల నుండి మహిళలు బతుకమ్మలతో బయలుదేరి వేడుకలు జరిగే అంగడి మైదానానికి చేరుకున్నారు. ఎంపి కవితను చూసేందుకు మహిళలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో అంగడి మైదానంలోని పలు గుంపుల వద్దకు కవిత నేరుగా వెళ్లి బతుకమ్మ ఆటపాట ఆడారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణాలోని పది జిల్లాల్లో సోమవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

పట్టణాలు, గ్రామాల్లో మహిళలు ఉత్సాహవంతంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఉత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండవ సంవత్సరం చేసుకునే ఉత్సవాలను సాంస్కృతిక శాఖ ఎంతో వైభవంగా నిర్వహించాలని సంకల్పించి రవీంద్ర ప్రాంగణాన్ని రంగురంగుల దీపాలతో సుందర మనోహరంగా అలంకరించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఉత్సవాలలో మహిళలు ఒక్కొక్కరు ఒక్కొక్క బతుకమ్మను రూపొందించి, ఆ బతుకమ్మను ముస్తాబుచేసి పూజించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

కాగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తొలిరోజు బంగారు బతుకమ్మతో బంతిపూల వనంలా మారింది.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఈ ఉత్సవాల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడే అంగడి మైదానం బంతి పూల వనంలా జనంతో నిండిపోయింది.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తీరొక్క పూలు, విద్యుత్ దీపాల కాంతు లు, కళాకారుల విన్యాసాలు, ప్రదర్శనలు, మహిళల బతుకమ్మ ఆటాపాటలతో అంగడి మైదానం కోలాహలంగా మారింది.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా పేద, గొప్ప తారతమ్యాలు లేకుండా సమైక్యతా భావంతో మహిళలందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే ఏకైక పండుగ.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పాటకే కాకుండా అందులో వాడే పువ్వులకు ఎంతో విశిష్టత ఉంది.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ జిల్లాల్లో బతుకమ్మలో గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పట్టుకుచ్చు, రుద్రాక్ష, గడ్డిపూలు, చామంతి, గుమ్మడి, మందారం, కట్లపూలు, నందివర్థనం, కనకాంబరాలు, బంతిపూలతో సుందరంగా తీర్చిదిద్దుతారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

దేవీనవరాత్రి ఉత్సవాలు చేసే సమయంలో అనగా ఆశ్వీజ (ఆశ్వయుజ) మాసంలో పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

రవీంద్రభారతిలో జరిగే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలకు ‘తెలంగాణ కళల జీవన దృశ్యాల ప్రదర్శన'గా వేదిక అవుతోంది. సోమవారం సాయంత్రం ఘంటసాల ప్రాంగణంలో ప్రారంభమైనాయి.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

కొద్దికాలంగా అహర్నిశలు శ్రమించి పట్టుదలతో ఒక చాలెంజీగా ఉత్సవాలను ఏర్పాటుచేస్తున్నానని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

లఘు చిత్రాలను, డాక్యుమెంట్రీలను, తెలంగాణ కళలు, ఆచార వ్యవహారాలును తెరమీద ప్రదర్శించడానికి రవీంద్రభారతి మినీ థియేటర్ సిద్ధం చేసామని, ఆధునిక పద్ధతులను మిళితం చేసి ప్రదర్శిస్తామని హరికృష్ణ తెలిపారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఆయా చిత్రాల దర్శకులు, సాంకేతిక నిపుణులతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మకు సంబంధించిన ఫొటోల ప్రదర్శన కూడా ఏర్పాటుచేసామని, కినె్నర డాక్యుమెంటరీని ఆ వాయిద్య కళాకారుడు మొగులయ్యపై తీసిన డాక్యుమెంట్రీతో పాటు పలు చిత్రాలను, తొలిదశలో తెలంగాణ ఉద్యమ, తెలంగాణ సాధనకోసం బలిదానాలు, కన్నీళ్లు తెప్పించే బలీయ సన్నివేశాలు కూడా ప్రదర్శిస్తున్నామని అన్నారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఉత్సవాలలో మహిళలకు ప్రాధాన్యత. విద్యార్థినులు, స్ర్తిలు, ముత్తయిదువులు పలురకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని తెలిపారు.

English summary
Bathukamma, the floral festival of Telangana, got off to a colourful start on Monday with women enthusiastically participating in the festivities across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X