వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమ సాహిత్యాన్ని విశ్లేషించిన 'తెలంగాణ సాహిత్యోద్యమాలు': పుస్తకావిష్కరణ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో వచ్చిన సాహిత్యాన్ని విశ్లేషిస్తూ కాసుల ప్రతాప రెడ్డి తీసుకు వచ్చిన 'తెలంగాణ సాహిత్యోద్యమాలు' పుస్తకర రచన ఉపయుక్తంగా ఉందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి ఆదివారం అన్నారు.

తెలుగు.వన్ఇండియా.కామ్ ఎడిటర్, రచయిత కాసుల ప్రతాప రెడ్డి రాసిన తెలంగాణ సాహిత్యోద్యమాలు పుస్తకావిష్కరణ ఆదివారం నాడు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముదిగంటి సుజాత రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. తెలంగాణ సాహిత్య ఉద్యమాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ కార్యాచరణను సాహితీవేత్తలు రూపొందించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు.

మాట్లాడుతున్న ప్రతాప రెడ్డి

మాట్లాడుతున్న ప్రతాప రెడ్డి

ప్రముఖ రచయిత కాసుల ప్రతాప రెడ్డి(తెలుగు.వన్ఇండియా.కామ్ ఎడిటర్) రచించిన తెలంగాణ సాహితోద్యమాలు వ్యాస సంకలన గ్రంథాన్ని ముదిగంటి సుజాతారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

రచయితతోపాటు ఆంధ్రజ్యోతి సంపాదకుడు కెశ్రీనివాస్, సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కొల్లాపురం విమల, సంగిశెట్టి శ్రీనివాస్, సాహిత్య అభిమాని శానంపూడి సైదిరెడ్డి, యాకూబ్ పాల్గొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సుజాత రెడ్డి

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సుజాత రెడ్డి

పుస్తకావిష్కరణ అనంతరం, సుజాతా రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భాషపై జరిగిన వివక్షే ఉద్యమ తీవ్రతకు దోహదపడిందన్నారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తెలంగాణ ఆకాంక్ష ఉందని, నెహ్రూ ఉదారవాద ప్రభావం వల్ల ఏర్పడిన ఏపీలో తెలంగాణకు అన్ని రంగాల్లో జరిగిన వివక్షను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు దారితీసిందన్నారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

సాహిత్యోద్యమంలో మొలకెత్తిన తెలంగాణ ఆకాంక్ష రాజకీయంగా కూడా ప్రభావం చూపి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం దాకా సాగిందని వక్తలు చెప్పారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ అనంతరం, సుజాతా రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భాషపై, సాహిత్యంపై దాడులకు ప్రతిగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎవరి సంస్కృతి, భాషను వారు పరిరక్షించుకోవాలన్నారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

తెలంగాణ సాహిత్య ఉద్యమాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ కార్యాచరణను సాహితీవేత్తలు రూపొందించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

కొల్లాపురం విమల మాట్లాడుతూ... వాళ్ళు-మనము అనే వ్యాసాన్ని లోతుగా వివరించారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు క్రియాశీలకంగా పాల్గొన్నారన్నారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

తెలంగాణ రావడంతోనే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వస్తున్న సాహిత్యం ఆగిపోకూడదని, అది కొనసాగాలని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె శ్రీనివాస్ అన్నారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ భాషను వాడే విషయంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే చొరవ చూపాలని కాకుండా సాహితీవేత్తలు, సాహితీ సంస్థలు ముందుకు వచ్చి పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ మాండలికం వాడకంపై విస్తృత స్థాయిలో చర్చజరపాలని సూచించారు.తొందరపడి గురజాడ, శ్రీశ్రీ సాహిత్య కృషిని విస్మరించడం తగదన్నారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

తెలుగు.వన్ఇండియా.కామ్ ఎడిటర్, రచయిత కాసుల ప్రతాప రెడ్డి రాసిన తెలంగాణ సాహిత్యోద్యమాలు పుస్తకావిష్కరణకు హాజరైనవారు.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
'telangana sahithyodhyamalu' book launching in Hyderabad photos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X