వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పంచాయతీ పోరు.. రెండో దశ పోలింగ్ పై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగా జరగనున్న పంచాయతీ స్థానాలకు 29,964 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు వివాదస్పదంగా భావించిన పంచాయతీల్లోని దాదాపు 6 వందలకు పైగా పోలింగ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్ సిద్ధం చేశారు. మరోవైపు పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సాయంత్రంకల్లా ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. అవి పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ఒకవేళ సాయంత్రం కుదరని పక్షంలో శనివారం నాడు ఉప సర్పంచ్ ను ఎన్నుకునేందుకు అవకాశమిస్తారు. వివిధ కారణాలతో కొన్నిచోట్ల సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. .

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్‌దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్‌దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడు

సర్పంచ్ స్థానాల వివరాలు :
నామినేషన్లు దాఖలైన పంచాయతీలు : 4,137
నామినేషన్లు దాఖలు కాని పంచాయతీలు : 7
ఏకగ్రీవ సర్పంచ్ స్థానాలు : 788
రెండో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాలు : 3,342
సర్పంచ్ గిరికి బరిలో నిలిచిన అభ్యర్థులు : 10,317

telangana second phase panchayat elections

వార్డు స్థానాల వివరాలు :
నామినేషన్లు దాఖలైన వార్డులు : 36,620
నామినేషన్లు దాఖలు కాని వార్డులు : 94
ఏకగ్రీవ వార్డు స్థానాలు : 10,317
రెండో దశలో పోలింగ్ జరుగుతున్న వార్డులు : 26,209
వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులు : 63,380

English summary
The second phase of panchayat polling is going on. Candidates from Sarpanch and Ward members will test their luck. Election officials have set up 29,964 polling stations for over 3,000 panchayats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X