వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ ఆదేశం - రేవంత్ రెడ్డి పిటిషన్‌పై భిన్న స్పందన..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో సచివాలయం కూల్చివేత వ్యవహారానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) అనూహ్య ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఈ అంశంలో జోక్యం చేసుకోలేమంటూనే, మరోవైపు పర్యావరణ వ్యవహారాల పరిశీలన కోసం గడువుతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ సోమవారం విచారించింది.

Recommended Video

Revanth Reddy Press Meet నిజాం ఖజానా, గుప్త నిధుల కోసమే సచివాలయం కూల్చివేత... ఇవిగో ఆధారాలు..!!

షాకింగ్: సచివాలయం కింద గుప్త నిధులు.. రంగంలోకి నిజాం వారసులు.. రేవంత్ రెడ్డి.. తొండ వల్ల..షాకింగ్: సచివాలయం కింద గుప్త నిధులు.. రంగంలోకి నిజాం వారసులు.. రేవంత్ రెడ్డి.. తొండ వల్ల..

కూల్చివేత పనుల్లో నిబంధనలు

కూల్చివేత పనుల్లో నిబంధనలు

సచివాలయం కూల్చివేత పనుల్లో నిబంధనలు పాటించంలేదంటూ వ్యక్తమైన అభ్యంతరాలపై హైకోర్టు.. పలు మార్లు స్టే ఉత్తర్వుల తర్వాత.. కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం తెలపడంతో పనులు కొనసాగించుకోవచ్చని తుది ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత అంశాన్ని హైకోర్టు పరిశీలిస్తున్నందున దీనిపై తాము కలుగుజేసుకోలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. రేవంత్ పిటిషన్ లో పర్యావరణ సంబంధిత అంశాల ప్రస్తావన కూడా ఉండటంతో కమిటీ ఏర్పాటుకు ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం.

‌ నిపుణులతో కమిటీ

‌ నిపుణులతో కమిటీ

సచివాలయం కూల్చివేతలో పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ (సీపీసీబీ), తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ), ఐఐటీ హైదరాబాద్‌ నిపుణులతో కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొన్న ఎన్జీటీ.. తదుపరి విచారనను సెప్టెంబర్‌ 25కు వాయిదా వేసింది.

కాంగ్రెస్ నేతలకు మరో ఎదురుదెబ్బ

కాంగ్రెస్ నేతలకు మరో ఎదురుదెబ్బ

కూల్చివేతను ఆపేందుకు ఆదేశాలివ్వబోమని ఎన్జీటీ స్పష్టం చేయడంతో కాంగ్రెస్ నేతలకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇదివరకే ఈ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు రేవంత్ పిటిషన్ పైనా ఎన్జీటీ దాదాపు అదే రకంగా స్పందించింది. 132 ఏళ్ల కిందట సచివాలయం కట్టేనాటికి ఎన్జీటీ, పర్యావరణ చట్టాలు లేవని, హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ కిందికి వచ్చే ప్రాంతంలో ఇప్పుడు కొత్త సచివాలయ నిర్మాణం తగదని రేవంత్ వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే,

రేవంత్ రెడ్డి ఆవేదన

రేవంత్ రెడ్డి ఆవేదన

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి సల్కునూరుకు చెందిన ఓ యువకుడు కరోనాతో ఆస్పత్రికి వెళ్లి, తల్లి ఒడిలోనే విలవిలలాడుతూ కన్నుమూసిన ఘటన తాలూకు వీడియో అందరినీ కంటతడిపెట్టుస్తున్నది. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘నిత్య హృదయవిదారక దృశ్యం. కరోనాతో విలవిలలాడుతూ కళ్ల ముందే ప్రాణాలొదులతోన్న వైనం. ఐనా... సీఎం కేసీఆర్ మనసు కరగడం లేదు. ఆ మనిషిలో కనికరం లేదు. ఈ నిర్లక్ష్యానికి అంతమెప్పుడు...!?'' అని కాంగ్రెస్ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌‌పై కక్ష..చంద్రబాబుతో సాయిరెడ్డి స్కెచ్ - కన్నా కోవర్టు ముసుగు - ఎవరికెవరు ఫిట్టింగ్?జగన్‌‌పై కక్ష..చంద్రబాబుతో సాయిరెడ్డి స్కెచ్ - కన్నా కోవర్టు ముసుగు - ఎవరికెవరు ఫిట్టింగ్?

English summary
Telangana Secretariat, revanth reddy, NGT, తెలంగాణ సచివాలయం, రేవంత్ రెడ్డి, ఎన్జీటీ The National Green Tribunal (NGT) has ordered to form a committee on environmental issues regarding demolition of telangana old Secretariat building. NGT on monday hears the petition filed by congress mp revanth reddy and said it won't order for any stays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X