• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సచివాలయ నిర్మాణం బైసన్ పోలో గ్రౌండ్ లో కాదని మాట మార్చిన కేసీఆర్ .. రహస్యం చెప్పిన విజయశాంతి

|

తెలంగాణ సెక్రటేరియేట్ నిర్మాణం గురించి కేసీఆర్ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయానని , తెలంగాణా సచివాలయ నిర్మాణం బైసన్ పోలో గ్రౌండ్ లో కాదని మాట మార్చిన కేసీఆర్ విషయంలో టీఆర్ ఎస్ నాయకులు చెప్పిన సీక్రెట్ విని షాక్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి . కేసీఆర్ మైండ్ సెట్ మారడం వెనుక ఎంతో రహస్యం దాగుందనికాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేసీఆర్ మాట మార్చారని మండిపడ్డారు .

ప్రధాని మోడీని ప్రతి దానికీ పిలవాలా !.. కేంద్రం కాళేశ్వరానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్న కేసీఆర్ప్రధాని మోడీని ప్రతి దానికీ పిలవాలా !.. కేంద్రం కాళేశ్వరానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్న కేసీఆర్

బైసన్ పోలో గ్రౌండ్ కాదు పాత సచివాలయ ప్రాంగణంలోనే అని మాట మార్చిన కేసీఆర్.. రహస్యం ఏమిటంటే

బైసన్ పోలో గ్రౌండ్ కాదు పాత సచివాలయ ప్రాంగణంలోనే అని మాట మార్చిన కేసీఆర్.. రహస్యం ఏమిటంటే

ఫేస్ బుక్ లో విజయశాంతి కేసీఆర్ మైండ్ సెట్ మారటం గురించి చాలా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. నిన్నటి వరకు సచివాలయ ప్రాంగణాన్ని బైసన్ పోలో గ్రౌండ్ కు తరలిస్తామని చెప్పిన తెలంగాణ సీఎం ఒకటే సారి మైండ్ సెట్ మార్చుకోవటానికి కారణం తెలిసి అవాక్కయ్యానని పేర్కొన్నారు విజయశాంతి . తెలంగాణకు సంబంధించిన విభజన సమస్యలు చాలా పెండింగులో ఉన్నప్పటికీ ఆ సమస్యలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బైసన్ గ్రౌండ్ కోసం కెసిఆర్ గారు తెగ పైరవీలు చేశారు. మొత్తానికి అనుకున్నది సాధించారు . ఆయన రెండోసారి సీఎం అయిన వెంటనే కేంద్రం కూడా కెసిఆర్ గారి కోరిక మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బైసన్ పోలో గ్రౌండ్ అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అక్కడ నిర్మాణం చెయ్యాలనుకున్న సెక్రటేరియట్ ను అక్కడ నిర్మాణం చెయ్యకుండా మనసు మార్చుకోవటానికి కేసీఆర్ కు చాలా పెద్ద కారణమే ఉందని చెప్పి విజయశాంతి ఆసక్తి రేకెత్తించారు .

అక్కడైతే టీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కేసీఆర్ కు భయం .. అందుకే సచివాలయ మార్పు

అక్కడైతే టీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కేసీఆర్ కు భయం .. అందుకే సచివాలయ మార్పు

కేసీఆర్ గారి మైండ్ సెట్ సడన్ గా మారిపోవటానికి , బైసన్పోలో గ్రౌండ్ వద్దు... పాత సచివాలయ ప్రాంగణం ముద్దు అని కొత్త పల్లవి అందుకోవటానికి కారణం ఏమిటంటే బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయాన్ని నిర్మించడానికి తలపెట్టి, శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొత్త సచివాలయంలో కి వెళ్లిన వెంటనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారని గులాబీ నేతలు నాతో చెప్పారు. తీరా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి చావు తప్పి, కన్ను లొట్టపోయిన విధంగా కెసిఆర్ గారి పరిస్థితి మారింది. దీంతో టిఆర్ఎస్ ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది అనే ఆలోచన కేసిఆర్ లో మొదలయ్యింది. అందుకే ఆయన అంతగా కావాలంటే పాత సచివాలయ బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తామని మాట మార్చారు . కెసిఆర్ గారి మైండ్ సెట్ అకస్మాత్తుగా మారడం వెనుక అసలు రహస్యం ఇదేనని ఇటీవల కలిసిన టిఆర్ఎస్ నేతలు కొందరు నాతో చెప్పిన చెప్పారని విజయశాంతి పేర్కొన్నారు.

కేసీఆర్ వ్యూహాలన్నీ బెడిసి కొట్టటమే బైసన్ పోలో గ్రౌండ్ మార్చటానికి కారణం అన్న విజయశాంతి

కేసీఆర్ వ్యూహాలన్నీ బెడిసి కొట్టటమే బైసన్ పోలో గ్రౌండ్ మార్చటానికి కారణం అన్న విజయశాంతి

బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన రోజు నుంచి కేసీఆర్ తన వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి అని ఆందోళన లో పడ్డారని, దాంతో పాత సచివాలయ ప్రాంగణం లోనే పునర్నిర్మాణం చేసి ,డిజైన్ మార్చాలని కెసిఆర్ భావిస్తున్నారని సమాచారం అని విజయశాంతి కేసీఆర్ మైండ్ సెట్ చేంజ్ అవటానికి కారణం చెప్పారు .ఇక అంతే కాదు ఇలాంటి వింతలు, విడ్డూరాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయాన్ని మార్చే మాటేమోగాని కెసిఆర్ గారి మైండ్ సెట్ మారకపోతే, సీఎం పదవి నుంచి ఆయనను మార్చడానికి తెలంగాణ ప్రజలు వెనుకాడరు అనే విషయాన్ని టిఆర్ఎస్ అధిష్టానం గుర్తించాలి అని విజయశాంతి ఘాటుగా విమర్శించారు

English summary
Congress leader and former MP Vijayashanti kept a post about the change of the KCR Mindset on Facebook. The Telangana CM who told him to move the Secretariat premises to Baison Polo Ground till yesterday there is a reason for the change of mind set, Vijaya Shanti said .. KCR has been concerned about the plans of the new secretariat in the Baison Polo Ground and that the KCR feels his plans are failing when he started the secrateriat construction to be in baison polo ground. that is the reason KCR changed his mind and rebuilt within the old secretariat complex and that the design has changed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X