వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎస్ అధికారిగా ఫెయిలయ్యాను.. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి.. వీకే సింగ్ రాజీనామా..

|
Google Oneindia TeluguNews

''ఎన్నో ఆశలు, ఆశయాలతో పోలీస్ సర్వీసులో చేరాను. కానీ ఐఏఎస్ అధికారిగా నేను ఫెయిలయ్యాను. తెలంగాణ ప్రభుత్వం కూడా నా పని తీరుకు పెద్దగా ఇంప్రెస్ కాలేదు. వివాదాన్ని ఇంకా పెద్దది చేయడం ఇష్టంలేదు. బహుశా ఈ నా అభిప్రాయం కూడా విలువ లేనిదే అయిఉండొచ్చు. విలువలేని వ్యక్తుల్ని భరించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా లేదేమో... '' అంటూ భావోద్వేగంతో కూడిన లేఖ ద్వారా తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి వినొయ్ కుమార్ సింగ్(వీకే సింగ్) తన రాజీనామా ప్రకటించారు.

పాకిస్తాన్ పై దాడికి భారత్ ప్లాన్.. చైనా ఇష్యూని డైవర్ట్ చేసేందుకే.. ఖురేషీ సంచలనం పాకిస్తాన్ పై దాడికి భారత్ ప్లాన్.. చైనా ఇష్యూని డైవర్ట్ చేసేందుకే.. ఖురేషీ సంచలనం

కేంద్రానికి లేఖ..

కేంద్రానికి లేఖ..

తెలంగాణ జైళ్ల శాఖ ఇన్ చార్జిగా పలు సంస్కరణలు చేపట్టి పాపులరైన వీకే సింగ్.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 33 ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ తనకు డీజీపీ స్థాయి ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదంటూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేసిన ఆయన.. ప్రమోషన్ రాకుంటే రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించిన మేరకు బుధవారం కేంద్ర హోం శాఖకు లేఖ పంపారు.

గాంధీ జయంతిన తప్పుకుంటా..

గాంధీ జయంతిన తప్పుకుంటా..

పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న వీకే సింగ్.. ఉద్యోగంలో ఉండి ఆ దిశగా పని చేయలేకపోతున్నానని, రిటైర్మెంట్ తర్వాత వ్యవస్థలో మార్పు కోసమే పని చేస్తానని పేర్కొన్నారు. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సింగ్ సర్వీసు ఇంకా కొద్ది నెలలు ఉన్నప్పటికీ వాలంటరీగా రాజీనామా ప్రకటించడం గమనార్హం. సత్యం, న్యాయం అనే పదాలకు మారుపేరైన గాంధీజీ జయంతి(అక్టోబర్ 2న) తాను విధుల నుంచి పూర్తిగా వైదొలుగుతానని, రాజీనామా లేఖను మూడు నెలల నోటీస్ పిరియడ్ గానూ భావించాలని కేంద్రానికి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఏ ప్రభుత్వం పట్లా తనకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు.

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు.. బ్రేక్ పడింది ఇందుకేనంటూ బాంబు పేల్చిన మంత్రి బాలినేనివైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు.. బ్రేక్ పడింది ఇందుకేనంటూ బాంబు పేల్చిన మంత్రి బాలినేని

పోలీస్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్..

పోలీస్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్..

నిజాయితీగా, పూర్తి నిబద్ధతతో పనిచేస్తే గనుక పోలీస్ ఉద్యోగమంత గొప్పటి మరొకటి ఉండబోదని, ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే యువత పోలీస్ సర్వీసును ఎంచుకోవడమే ఉత్తమమని వీకే సింగ్ పేర్కొన్నారు. ఉద్యోగంలో నీతినిజాయితీలు మాత్రమే కనబరిస్తే సరిపోదని, ఇంకా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన 33 ఏళ్ల సర్వీసులో అలాంటివెన్నో ఫేస్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

Recommended Video

Sushant Singh Rajput : Sushant కు న్యాయం జరగాలి..అందుకే Forum ప్రారంభించా! - Shekhar Suman
కేసీఆర్ సర్కారుపై విమర్శలు..

కేసీఆర్ సర్కారుపై విమర్శలు..

నిబంధనల ప్రకారం 33 ఏళ్లు సేవలందించిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా తాను డీజీపీ పదవికి అర్హుడినంటూ గత నెలలో తెలంగాణ సీఎం, సీఎస్ లకు వీకే సింగ్ రాసిన లేఖ దుమారం రేపింది. పోలీస్ అకాడమీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వృధానే అని, పోలీస్ అకాడమీ వల్ల పెద్ద ఉపయోగం లేదని గతంలో చేసిన వ్యాఖ్యలు పోలీసు శాఖలో కలకలం రేపాయి. ప్రభుత్వం తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గతంలో ఆకునూరి మురళి లాంటి అధికారులు సర్వీస్ ముగియక ముందే రాజీనాలు చేయడం తెలిసిందే.

English summary
telangana cadre senior IPS officer vk singh, who criticized kcr govt for not promoting his as dgp rank, sends resignation letter to union home ministry on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X