• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదీ జితేందర్ రెడ్డి వాయిస్: కోదండరామ్ కీలకమే, కెసిఆర్‌కు కోపం రాదా!

By Swetha Basvababu
|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ తెలంగాణ నేతల పాత్రేమీ లేదని, అసలు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సరిగ్గా ముందుకు రాలేదని తెలంగాణ రాష్ట్రసమితి నాయక గణం వాదిస్తూ ఉంటుంది.

కానీ అదెంత అవాస్తవమో లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత ఏపీ జితేందర్ రెడ్డి వాదన చూస్తే అవగతమవుతుంది. దీనికి భూమిక మంగళవారం నాడు భారత 13వ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు తెలిపేందుకు ఆదివారం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడిన 'సిగ్నేచర్ బుక్' అందజేయాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంకల్పించారు. అంటే పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల సంతకాలతో కూడిన పుస్తకం అన్న మాట. అక్షరమాల క్రమంలో ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, లోక్ సభలో పార్టీ నేత ఎపీ జితేందర్ రెడ్డి ఒకింత ఉత్సాహం ప్రదర్శించారు. తన సంతకం పక్కనే 'జై తెలంగాణ' అని రాశారు. కానీ దానికి సదరు సంతకాలు సేకరిస్తున్న రాజ్యసభ అధికారి అభ్యంతరం చెప్పారు.

తెలంగాణపై జితేందర్ రెడ్డి వాదన ఇలా

తెలంగాణపై జితేందర్ రెడ్డి వాదన ఇలా

దీనిపై జితేందర్ రెడ్డి చేసిన వాదన గమ్మత్తుగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందుకు క్రుతజ్నతగా రాష్ట్రపతికి అందజేసే ఈ పుస్తకంలో తన సంతకంతోపాటు ‘జై తెలంగాణ' అని రాయడం తమకు సంత్రుప్తి ఇస్తుందని ఆయన వివరించారు. జితేందర్ రెడ్డి వివరణతో ఆమె సమ్మతించారు. 14 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలంతా ఎంతగా ఉద్యమించారో, ఆ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి తెలంగాణ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ పాత్ర కూడా గణనీయమైందేనని చెప్పారు. అందుకు క్రుతజ్నతగా ఆయనకు బహూకరించే ‘సిగ్నేచర్ బుక్'లో ‘జై తెలంగాణ' అనే నినాదాం రాయడం సముచితం, సహేతుకం అని ఆయన వివరణ ఇచ్చారు. జితేందర్ రెడ్డి చేసిన వాదనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఆవిర్బావంలో కాంగ్రెస్ పార్టీ ఎంత కీలక పాత్ర పోషించిందో అవగతమవుతూనే ఉన్నది.

  Uttam Kumar Reddy Warns To KCR and KTR
  తెలంగాణ ఏర్పాటుపై ఇలా టీఆర్ఎస్

  తెలంగాణ ఏర్పాటుపై ఇలా టీఆర్ఎస్

  ఈ వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి తెలియవా? అంటే తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తున్నది. దీనికితోడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల సాక్షిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నది అధికార పార్టీ. కానీ తెలంగాణలోని సబ్బండ వర్ణాలకు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎటువంటి ఇబ్బందుల మధ్య సాగిందన్న విషయం తెలుసు. కానీ అదేమీ తెలియకుండా చేసేందుకు పాఠ్య పుస్తకాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అధికార టీఆర్ఎస్ వల్లే సాధ్యమైందన్న అభిప్రాయాన్ని చొప్పించేలా పాఠ్యాంశం రాయించారని సమాచారం.

  కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీ భవితవ్యాన్ని బలిపీఠంపై పెట్టి మరి రాష్ట్రం ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో తన పాత్రేమిటో స్పష్టంగానే చెప్పగలిగింది. తాజాగా తెలంగాణలో చేపడుతున్న పథకాల అమలులో వైఫల్యాలను ప్రశ్నించినప్పుడల్లా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సైతం మాజీ మంత్రులైన కాంగ్రెస్ పార్టీ నేతలపై సెటైర్లతో కూడిన విమర్శలు గుప్పించడం కద్దు.

  నిజమే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్రులదే ఆధిపత్యం అన్న సంగతి అందరికీ తెలిసిన నిష్ఠూర సత్యం. కానీ ఆసరాగా తెలంగాణ నేతలపై విమర్శలు చేయడం వల్ల ఒనగూడే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ అన్న సంగతి టీఆర్ఎస్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే ప్రజలు సరైన సమయంలో కీలెరిగి వాత పెడతారన్న సంగతి విస్మరించొద్దని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

  తెలంగాణ ఏర్పాటులో సోనియా, కేసీఆర్, కోదండరాంలదీ కీలక పాత్రే

  తెలంగాణ ఏర్పాటులో సోనియా, కేసీఆర్, కోదండరాంలదీ కీలక పాత్రే

  ఉమ్మడి రాష్ట్ర హయాంలో సీమాంధ్ర నేతల నాయకత్వం కారణంగా తెలంగాణ ప్రాంత నేతలు నాయకత్వ పాత్ర పోషించలేకపోవడమే వెలితిగా ఉన్నది. ఇటీవల కాంగ్రెస్ పార్టీని పాతరేస్తేనే అభివ్రుద్ది సాధ్యమని ఒక యువనేత గంభీర వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన తండ్రి వంటి వారు.. పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనన్న నగ్న సత్యాన్ని గుర్తించకపోతే నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాత్ర ఎంత ఉన్నదో.. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం కోదండరాం... ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పాత్ర ఉన్నదన్న విషయం విస్మరించరానిదని విమర్శలు హెచ్చరిస్తున్నారు.

  English summary
  Telangana Rastra Samiti indirectly accepted that Congress played key role in Telangana appointed while it's revealed by TRS Lok Sabha Party leader AP Jitender Reddy he had signed in 'signature book' of MP's to be present President Pranab Mukherjee tomaarrow in Parliament Central Hall. Jitender Reddy said that Pranab Mukherjee played key role when he union minister that Congress dicided to give Telangana State.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X