చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు 12 ఏళ్ల తర్వాత తిరిగివచ్చిన సంఘటన గురువారం చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చార్మినార్ ఇన్ స్పెక్టర్ యాదగిరి తెలిపిన వివారాలిలా ఉన్నాయి. అంబర్ పేట్‌కు చెందిన శివ, అంజమ్మ దంపతుల కుమారుడు ఆంజనేయులు (21)ను 12 ఏళ్ల క్రితం మాట వినడం లేదని తండ్రి తీవ్రంగా మందలించాడు.

దీంతో ఆతను ఇంట్లో నుంచి పారిపోయి కాచిగూడలో రైలు ఎక్కి చెన్నైకి చేరుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తూ స్నేహితులతో కలిసి చిన్న చిన్న నేరాలు చేసేవాడు. అంతేకాకుండా వారితో కలిసి హత్యలో పాల్గొనడంతో ఆంజనేయులకు నాలుగేళ్లు శిక్ష విధించిన కోర్టు అతను మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.

శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న ఆంజనేయులుకు స్కోప్ ఇండియా ఆర్గనైజేషన్ డైరెక్టర్ సత్తిబాబు తమ సంస్ధలో మూడు నెలల పాటు నేరవృత్తిని వదిలేసేందుకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చాడు. అనంతరం ఆంజనేయులుని హైదరాబాద్‌లోని హెల్ప్ ఏజే ఇండియా సంస్ధకు అప్పగించాడు.

ఇందులో భాగంగా ఆంజనేయులు తాను హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన వాడిగా చెప్పడంతో ఈ నెల 8వ తేదీన సత్తయ్య బాబు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ, అంజమ్మల కు అప్పగించారు. 12 ఏళ్ల తర్వాత వచ్చిన తన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. మిఠాయిలు తనిపించి వారి సంతోషాన్ని వ్యక్త పరిచారు.

12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు 12 ఏళ్ల తర్వాత తిరిగివచ్చిన సంఘటన గురువారం చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చార్మినార్ ఇన్ స్పెక్టర్ యాదగిరి తెలిపిన వివారాలిలా ఉన్నాయి.

 12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

అంబర్ పేట్‌కు చెందిన శివ, అంజమ్మ దంపతుల కుమారుడు ఆంజనేయులు (21)ను 12 ఏళ్ల క్రితం మాట వినడం లేదని తండ్రి తీవ్రంగా మందలించాడు. దీంతో ఆతను ఇంట్లో నుంచి పారిపోయి కాచిగూడలో రైలు ఎక్కి చెన్నైకి చేరుకున్నాడు.

 12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

ఆ తర్వాత కుండుటూర్‌లో నేరస్తులతో సహవాసం చేశాడు. ఆటో డ్రైవర్‌గా హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తూ స్నేహితులతో కలిసి చిన్న చిన్న నేరాలు చేసేవాడు. అంతేకాకుండా వారితో కలిసి హత్యలో పాల్గొనడంతో ఆంజనేయులకు నాలుగేళ్లు శిక్ష విధించిన కోర్టు అతను మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.

 12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న ఆంజనేయులుకు స్కోప్ ఇండియా ఆర్గనైజేషన్ డైరెక్టర్ సత్తిబాబు తమ సంస్ధలో మూడు నెలల పాటు నేరవృత్తిని వదిలేసేందుకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చాడు. అనంతరం ఆంజనేయులుని హైదరాబాద్‌లోని హెల్ప్ ఏజే ఇండియా సంస్ధకు అప్పగించాడు.

 12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

ఇందులో భాగంగా ఆంజనేయులు తాను హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన వాడిగా చెప్పడంతో ఈ నెల 8వ తేదీన సత్తయ్య బాబు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ, అంజమ్మల కు అప్పగించారు. 12 ఏళ్ల తర్వాత వచ్చిన తన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. మిఠాయిలు తనిపించి వారి సంతోషాన్ని వ్యక్త పరిచారు.

English summary
A youngster, now aged 21, who ran away from his house in Amberpet as a nine-year-old, was reunited with his parents with the help of NGOs and the police on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X