మే 13న పదో తరగతి ఫలితాలు.. రిజల్స్ట్ చూసుకునే వెబ్ సైట్లు ఇవే
హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 13వ తేదీన రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 23 పాఠశాలల నుంచి 5 లక్షల 52 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు.
మే 13న 10th క్లాస్ ఫలితాలు#SSCresults #SSC #Telangana pic.twitter.com/h1SE4w5BDT
— Oneindia Telugu (@oneindiatelugu) May 10, 2019
ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ఉదయం 11.30గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుధాకర్ వెల్లడించారు. పేపర్ వాల్యుయేషన్ కొద్దిరోజుల కిందటే పూర్తయినా.. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొనడంతో 10వ తరగతి రిజల్ట్స్ రిలీజ్ లో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించారు.ఫలితాలు ఈ వెబ్ సైట్ల ద్వారా చూసుకోవచ్చు.
www.bse.telangana.gov.in, http://results.cgg.gov.in

పదో తరగతి ఫలితాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకటికి రెండుసార్లు అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి, మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల విషయంలో వారి ఆన్సర్ షీట్లను తిరిగి పరిశీలించినట్లు సమాచారం. మొత్తానికి అన్నివిధాలుగా ఒకే అనుకున్న తర్వాత మే 13వ తేదీ సోమవారం నాడు ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఆయా స్కూళ్లకు సంబంధించిన విద్యార్థుల ఫలితాలు ఒకే చోట కన్పించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.