వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు., బడ్జెట్‌‌కు ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం.,ప్రవేశపెట్టనున్న హారీష్

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన పూర్తిస్థాయి కేబినెట్ సమావేశమైంది. కాగా రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాసేపటి క్రితమే సమావేశమైన మంత్రి మండలి బడ్జెట్ ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం [సెప్టెంబర్9] నుండి ప్రారంభం కానున్నాయి. గత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కాగా ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి హారీష్ రావు బడ్జెట్‌నున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి స్పీకర్ అధ్యర్యంలో ఆల్‌పార్టీ సమావేశం కొనసాగనుంది. సమావేశంలో సభ ఎన్ని రోజుల నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నారు.

Telangana state assembly sessions will be started on monday

సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు చేశారు..అధికారులతో కొద్ది రోజుల క్రితం సమావేశమైన దేశావ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు సూచించారు.ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదాయం తగ్గిందని చెప్పిన ఆయన ఆర్ధిక మాంద్యానికి పలు రంగాలపై ప్రభావం పడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఆదాయాలు బాగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయాలతో పాటు అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. రానున్న బడ్జెట్ పూర్తిగా వాస్తవ రూపంలో ఉండాలని చెప్పిన ఆయన వ్యవసాయం, ప్రజాసంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివాడిగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల అంశంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఇంటర్ మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనలు,కాంగ్రెస్ పార్టీ విలీనం లాంటీ సమస్యలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టనుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరించనుంది.

English summary
Telangana state assembly sessions will be to started September 9. The budget will be introduced on monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X