వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో తీపి కబురు: 2,786 ఉద్యోగాలకు నోటిఫికేషన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురునందించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీఎస్‌పీఎస్సీ 2786 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేసింది.

గ్రూప్‌-4, వీఆర్వో, ఆర్టీసీ, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌వో), హోం, రెవెన్యూ శాఖలో స్టెనో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 5 నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్‌-4లో 1421, ఆర్టీసీలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నింటికీ జూన్ 7 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. వీటన్నింటికీ అక్టోబర్‌ 7న పరీక్ష నిర్వహిస్తారు.

కాగా, ఈ పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించాలా? లేదంటే ఆఫ్‌లైన్లోనా అనేది దరఖాస్తులు సంఖ్యను బట్టి నిర్ణయించాలని భావిస్తున్నారు. అలాగే, ఎకనమిక్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగంలో సహాయ గణాంక అధికారి, మండల ప్రణాళికా గణాంక అధికారి ఉద్యోగాలు 774 భర్తీ చేయనున్నారు. వాటికి సంబంధించి ఈ నెల 8 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్‌ 2న పరీక్ష నిర్వహిస్తారు.

 Telangana State to fill 2,786 posts; TSPSC to issue notification

ఈ నోటిఫికేషన్‌లో కీలకమైనది వీఆర్వో ఉద్యోగాలు. వీటికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి ఈ నెల 8 నుంచి జులై 2 వరకు దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్‌ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

రెవెన్యూ, హోంశాఖలలో 19 స్టెనో ఉద్యోగాలకు ఈ నెల 11 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే, ఈ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనేది తర్వాత నిర్ణయించనున్నారు. మొత్తమ్మీద వీఆర్వో ఉద్యోగాలకు ఇంటర్‌ కనీస విద్యార్హతగా నిర్ణయించారు. రెండ్రోజుల క్రితమే 18వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.

English summary
On the eve of State Formation Day, the Telangana State Public Service Commission (TSPSC) announced that 2,786 vacancies under Group-IV, VRO and ASO categories would be notified on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X