• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సోనియా కఠోర నిర్ణయం వల్లే తెలంగాణ: షిండే, కల్లు తాగిన దిగ్విజయ్

By Pratap
|

వరంగల్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కఠోర నిర్ణయం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెసు నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన కాంగ్రెసు వరంగల్ లోకసభ ఎన్నికల ప్రచార సభలో ఆయన సోమవారం ప్రసంగించారు. తెలంగాణ బిల్లుపై సంతకం చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్ హామీ ఏమైందని ఆయన అడిగారు.

మహారాష్ట్రలో విదర్భ సమస్య ఉన్నప్పటికీ తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేయించామని సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. బీజేపీ, కేసీఆర్‌ కాంగ్రెస్‌పై దుష్పచారం చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ చేశామని ఆయన స్పష్టం చేశారు.

వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని షిండే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి, వినోద్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే, వరంగల్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం వరంగల్ జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) కార్యాలయంలో గౌడ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌడ సోదరులు తెచ్చిన కల్లును పలువురి అభ్యర్థన మేరకు ఆయన తాగారు. తాడును, మోకును మెడలో వేసుకుని ఆయన గౌడ్లందరూ కాంగ్రెసు పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు.

వరంగల్‌ ఉప ఎన్నికలో గిరిజనులు టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని ఎల్‌హెచపీఎఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్‌ పిలుపునిచ్చారు. ఆదివా రం ఆయన వరంగల్‌ జిల్లా తొర్రూరులో మాట్లాడారు. గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.

Telangana state formed with Sonia's decision

తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తానని, 12శాతం రిజర్వేషన్లను అమలుచేస్తానని ప్రకటించి అమలు చేయలేదన్నారు. దీం తో గిరిజనులు విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్నారు. గిరిజనులసంక్షేమాన్ని విస్మరిస్తున్న టీఆర్‌ ఎ్‌సకు ఎన్నికల్లో తగిన బుద్ధ్ది చెప్పాలన్నారు.

వరంగల్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు డబ్బు సంచులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలతో అవినీతికి తావులేకుండా పనిచే సే వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ను గెలిపించాల ని కోరారు.

ఆదివారం బాలసముద్రంలో విలేకరులతో మా ట్లాడుతూ టీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే అహంకారంతో పనిచేస్తుందని, బీజేపీకి ఓటు వేస్తే మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని, కాంగ్రె్‌సకు ఓటు వేస్తే అవినీతికి పాల్పడే అవకాశం ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Congress senior leader and ex union minister Sushil Kumar Shinde said that Telangana state was formed with the decision of Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X