వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ యువతికి అరుదైన ఛాన్స్: గూగుల్‌లో రూ.1.20 కోట్ల ప్యాకేజీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు చెందిన కుందూరు స్నేహారెడ్డికి గూగుల్ అరుదైన అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్వేషించి ఐదుగురిని తీసుకుంది. వారికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనం ఇచ్చి ఉద్యోగాలను ఇచ్చింది. ఇందులో తెలుగు అమ్మాయి స్నేహ కూడా ఉన్నారు.

స్నేహ హైదరాబాదులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇటీవలే కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. చదువుతో పాటు భిన్న అంశాల్లో మంచి ప్రదర్శన కనబర్చి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది.

 Telangana student bags Rs.1.2 crore package with Google

స్నేహారెడ్డి వయస్సు 22. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తన సెవంత్ కాన్వోకేషన్ సందర్భంగా ఇచ్చిన నాలుగు గోల్డ్ మెడల్స్‌లలో ఒక దానిని స్నేహ సాధించింది. ఎక్సలెన్స్ ఇన్ అకడమిక్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు గాను ఆమె ఈ మెడల్‌ను రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా అందుకుంది.

English summary
Kudugunta Sneha Reddy from Warangal, who graduated from IIT-Hyderabad this year has bagged a whopping Rs 1.2 crore pay package per annum from Google, the highest received by a student in IIT-H’s history since it was established in 2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X